సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి
వి.కోట: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా సంక్రాతి పండుగ నిలుస్తుందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని తన స్వగ్రామమైన కొత్తూరులో భోగి మంటలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి, సంక్రాంతి పండుగలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి జెడ్పీ చైర్మన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. జెడ్పీ చైర్మన్ సతీమణి భాగ్యమ్మ, తనయులు నరేంద్ర, అమరనాథ్ పాల్గొన్నారు.


