ఇంటింటా సంక్రాంతులు నిండాలి
నగరి : సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, కనుమ కమ్మనైన అనుభూతులు మిగల్చా లని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. శుక్రవారం కనుమ పండుగను ఆమె నగరి పట్టణంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైభవంగా నిర్వహించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన తిరుత్తణి సుబ్రమణ్య స్వామిని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేసి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంప్రదాయాలకు నెలవన్నారు. సంక్రాంతి పండుగ అందరిలో వెలుగులు నింపాలన్నారు. అలాగే కనుమ ప్రజలకు కమ్మనైన అనుభూతులను నింపాలన్నారు. గోమాతకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అన్నదాత అయిన రైతుకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ సంక్రాంతి అయితే రైతుతో పాటు వ్యవసాయ పనుల్లో పాల్గొనే గోమాతకు ప్రాధాన్యత ఇవ్వడానికి కనుమ పండుగన్నారు. గోమాత సకల దేవతలకు నిలయమన్నారు. గోమాతను పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే అన్నారు.
ఇంటింటా సంక్రాంతులు నిండాలి


