నాటుకోడా మజాకా!
జిల్లాలో పెరిగిన నాటుకోళ్ల వినియోగం పల్లెల్లోని నాటు కోళ్లకు భలే డిమాండ్ సంక్రాంతిలో భారీగా పెరిగిన కొనుగోళ్లు నాటుకోడిచారు, రాగిముద్ద భలేగా ఉంటుందబ్బా!
పలమనేరు: ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ వినియోగం ఎక్కువైంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చికెన్ వాడ కా లు భారీగా పెరిగాయి. దీంతో ధరలు కూడా అ మాంతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రాయిలర్ కోళ్లకంటే గ్రామాల్లోని నాటు కోడి పుంజులకు భారీ గా డిమాండ్ పెరిగింది. కోడి పుంజు రకాన్ని బట్టి రూ.5 వేలు దాటినా అస్సలు వదలండం లేదు. సంక్రాంతి లో కనుమతోపాటు నాన్‌వెజ్ పార్టీ ఏదై నా ఉందంటే నాటుకోడి పక్కాగా ఉండాల్సిందే.
పెరిగిన వినియోగం
గతంలో పల్లెల్లో ప్రతిఇంటి వద్దా పెరటి నాటుకోళ్లు కచ్చింతంగా ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కోసి వండేవారు. జీవన శైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. రెడీ గా దొరికే బ్రాయిలర్ కోళ్ల వినియోగం పెరిగింది. దీ న్ని తినడంతో ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమేన ని జనం గ్రహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రా యిలర్ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 50 టన్ను లుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులు గా ఉండేది. ప్రస్తుతం రోజువారి నాటుకోళ్ల వినియో గం 10 టన్నులుకు చేరిందని వ్యాపారుల అంచనా.
రేటు ఎంతైనా..!
ప్రస్తుతం నాటుకోడి(లైవ్) కిలో రూ.రూ.350 పలుకుతోంది. కోడి బరువును బట్టి ధర నిర్ణయిస్తారు. అయితే కొన్ని జాతి కోళ్ల ధరలు రూ.3వేల నుంచి రూ.5 వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడిపుంజు, బెరసకోడి, చిలకమూతి కోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది.
నాన్‌వెజ్‌లో నాటుకోడే నం.1
ఘుమఘుమలాడే నాటుకోడిచారు, రాగిముద్ద ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. మందులు వాడి నలభై రోజుల్లో పెంచే బ్రాయిలర్ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి విటమిన్లు ఉండడంతో ఎక్కువ మంది దీన్నే ఇష్టపడుతుంటారు. ఇక రాయలసీమ సంప్రదాయ వంటకమైన రాగి ముద్దకు నాటుకోడి పలుసుంటే లొట్టలేసుకుని లాగించేస్తారు. దీనికున్న డిమాండ్‌ను చూసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోలే కాదు పక్కనే ఉన్న కర్ణాటకలోని కోలా రు, చింతామణి, చిక్‌బళ్లాపుర్, బెంగళూరు ప్రాంతాంలోనూ ఈమధ్య స్పెషల్ నాటుకోడి చారు, రాగిముద్ద హోటళ్ల భారీగా వెలిశాయి.
నాటుకోడా మజాకా!
నాటుకోడా మజాకా!


