మిట్టపల్లెలో బొలెరో బోల్తా
బంగారుపాళెం: మండలంలోని మిట్టపల్లె వద్ద సోమవారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. పలమనేరు నుంచి చిత్తూరుకు టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రహ దారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రహదారి పై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన బొలెరో వాహనాన్ని పక్కకు తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
మెరుగైన విద్యనందించాలి
రొంపిచెర్ల : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను ఉపాధ్యాయులు అందించాలని చిత్తూరు జిల్లా డీవైఈఓ ఇందిర సూచించారు. సోమవారం రొంపిచెర్ల కస్తూర్భా గురుకుల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. డీవైఈఓ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓ ఇంద్రాణి, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సుజాత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, అమరశేఖర్ పాల్గొన్నారు.


