
క్షుణ్ణంగా సర్టిఫికెట్ల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. గురువారం అపోలో యూనివర్సిటీ, ఆర్‌వీఎస్ నగర్‌లోని ఎస్వీ సెట్‌లో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎంపికై న అభ్యర్థులు ఆయా కేంద్రాలకు విచ్చేశారు. పరిశీలన కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కే వీఎన్ కుమార్‌ల పర్యవేక్షణలో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. వీరితో పాటు ప్రతి కేంద్రంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్‌కుమార్ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరి పర్యవేక్షణలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఫేక్ సర్టిఫికెట్‌ల కట్టడికి ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా అభ్యర్థుల సర్టిఫికెట్‌లను పరిశీలించారు.