
కొత్త పంథా..ఇసుక దందా
సాక్షి టాస్క్ ఫోర్స్: గూడూరు వయా చిత్తూరు మండ లం మీదుగా తమిళనాడుకు పుష్ప రేంజ్‌లో ఇసుక దందా నడుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూట మి నేతలు రెచ్చిపోతున్నారు. ఈ ఆక్రమ వ్యవహారా న్ని స్థానికులు బట్టబయలు చేశారు. అయితే పోలీసు లు కేసు నమోదు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. సరిగ్గా మరో 5 నిమి షాల్లో జిల్లా సరిహద్దు దాటి తమిళనాడుకు వెళ్లిపోయే సమయంలో చిత్తూరు మండలం, అనంతాపురం గ్రా మం వద్ద గురువారం ఓ లారీ టైరు పేలి నిలిచిపోయింది. తీరా ఆ లారీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న బండేనని స్థానికులు నిర్థారణకు వచ్చి.. అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు స్పందించకపోవడంతో లారీ పైన కట్టిన పట్టను విప్పి చూడగా.. ఇసుకపై వరి పొట్టు బ్యాగులను నింపి ఉండడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్క డకు చేరుకున్న బీఎన్‌ఆర్ పేట ఎస్‌ఐ నాగసౌజన్య లా రీని అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనిపై పోలీసు లు కేసు నమోదు చేయలేదు. ఈ అక్రమ వ్యవహారం మొత్తం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా కూటమి నేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాన్ని వదిలిపెట్టేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఎస్‌ఐ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. స్థానికులు కూడా దీనిపై సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని ఆమె పేర్కొన్నారు.

కొత్త పంథా..ఇసుక దందా

కొత్త పంథా..ఇసుక దందా