
అది నెరవేరితే చాలు సామీ
హంద్రీ–నీవా జలాలు వస్తున్నాయంటున్నారు. వాటిని ఇక్కడి చెరువులకు నింపాలి. భూగర్భజలాలు పెరగాలి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పాలి. 6,300 ఎకరాల్లో చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణకు 0.5 టీఎంసీల సాగునీరు, 4.02 లక్షల మందికి 0.6టీఎంసీల తాగునీరు అందుతుందని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. – రామరాజ్,
రామాపురం, రైతు, బైరెడ్డిపల్లి మండలం
భూగర్భ జలాలు పెరుగుతాయి
నాకు మూడెకరాల పొలం ఉంది. మా పొలం మధ్యలోనే హంద్రీ–నీవా కాలువ వచ్చింది. పొలం పోగొట్టుకున్నప్పుడు బాధ కలిగింది. గత ప్రభుత్వంలో కాలువలో నీరు వదిలినప్పుడు భూగర్భజలాలు పెరిగాయి. అందుకే ఈ ప్రాంతంలోని చెరువుల్లోకి కృష్ణా నీటిని నింపాలి. అప్పుడు ఇక్కడున్న బోర్లలో నీరు బాగా వస్తే దిగులుండదు. – శ్రీనివాసులు, గుండుగల్లు,
గంగవరం మండలం
చెరువులు నిండితే చాలు
నాకు రెండెకరాల పొలం ఉంది. అందులో మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. ఎందుకంటే చెరువుల్లో నీరు లేదు. హంద్రీ–నీవా కాలువ ద్వారా వచ్చే నీటితో ఇక్కడి చెరువులను నింపాలి. అప్పుడే బీడు భూములుగా మారిన పొలాలు మళ్లీ పచ్చగా మారతాయి.
– వెంకట్రమణ, బొమ్మరాజుపల్లె,
గంగవరం మండలం

అది నెరవేరితే చాలు సామీ

అది నెరవేరితే చాలు సామీ