
ఇదీ చెరువుల దుస్థితి
పలమనేరు ఇరిగేషన్ పరిధిలో మొత్తం 787 చెరువులున్నాయి. వీటిల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం గలవి) 57 దాకా ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 దాకా ఆక్రమణలకు గురై కనిపించకుండా పోయాయి. మిగిలిన వంద దాకా చెరువులు 10 నుంచి 30 శాతం ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పటికే కూటమి నేతల దెబ్బకు చెరువులు గుంతలమయయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వర్షపు నీరు ఈ గుంతల్లోకి సైతం రాని పరిస్థితి. ఎటూ వానలోచ్చినా చెరువుల్లోకి నీరురాదు కాబట్టి కృష్ణా జలాలతో వీటిని నింపడం మినహా మరో మార్గం లేదు.