మాటేసిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

మాటేసిన మృత్యువు

Aug 13 2025 5:34 AM | Updated on Aug 13 2025 5:34 AM

మాటేస

మాటేసిన మృత్యువు

దైవదర్శనానికి వెళుతుండగా..

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన పద్మ, ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిన విశ్వనాథరెడ్డి

కావిడి ఎత్తుకొని వారంతా భక్తి భావంతో తిరుత్తణి ఆలయానికి కారులో బయలు దేరగా అనుకోని మృత్యువు దారిలోనే కాపు కాసి కాటేసింది. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడి ముగ్గురు విగత జీవులయ్యారు. కుటుంబ సభ్యులు ఏం జరిగిందో ఊహించే సరికి ఘోరం జరిగిపోయింది. ఈ విషాదకర ఘటనతో జీడీ నెల్లూరు మండలం గోవిందరెడ్డి పల్లె శోకసంద్రంగా మారింది.

గంగాధర నెల్లూరు : తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి ఆలయానికి కావిడి ఎత్తుకొని దైవదర్శనానికి కారులో వెళుతుండగా మార్గమధ్యలో అనుకోని ప్రమాదం కుటుంబాన్ని కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తుల వివరాల మేరకు గంగాధర నెల్లూరు మండలం వేపంజేరి పంచాయతీ గోవిందరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ మండల అధ్యక్షుడు సురేందర్‌ రెడ్డి తమ్ముడు విశ్వనాథ రెడ్డి ( చిన్నబ్బ) కుటుంబ సభ్యులు మంగళవారం తమ ఇంటి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి మురుగన్‌ ఆలయానికి కావిడి ఎత్తుకొని కారులో బయలుదేరారు. ఈ కారులో విశ్వనాథ రెడ్డి, ఆయన భార్య రేఖ, వదిన చిట్టెమ్మ, అన్న కుమార్తె కీర్తి, అన్న మనవడు శాన్విక్‌ రెడ్డి , గ్రామస్తురాలు (పనిమనిషి) పద్మ, గోవిందరెడ్డి పల్లి నుంచి తిరుత్తణికి ప్రయాణిస్తుండగా పల్లిపట్టు నుంచి కొద్ది దూరంలో తమిళనాడుకు సరిహద్దులో తర్చూరు హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం జరిగింది. తమిళనాడు సరిహద్దులో కుమార రాజపేట– వెంగళరాజ కుప్పం ప్రాంతంలో అసంపూర్తిగా పూర్తిస్థాయిలో నిర్మాణం కానీ హైవే రోడ్డు లో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గ్రామస్తురాలు పద్మ(50) అక్కడికక్కడే చనిపోగా విశ్వనాథరెడ్డి(44) తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య రేఖ , వదిన చిట్టెమ్మ, అన్న కుమార్తె కీర్తి తీవ్ర గాయాలతో తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో విశ్వనాథరెడ్డి అన్న కుమార్తె కీర్తి కుమారుడు శాన్విక్‌ రెడ్డి ( ఒక సంవత్సరం లోపు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

న్యూస్‌రీల్‌

హైవే రోడ్డు నిర్మాణం వద్ద కారు ప్రమాదం

ముగ్గురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

జీడీ నెల్లూరు వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లో విషాదం

మాటేసిన మృత్యువు1
1/2

మాటేసిన మృత్యువు

మాటేసిన మృత్యువు2
2/2

మాటేసిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement