పుంగనూరు : జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మండలంలోని చండ్రమాకులపల్లె జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న గానవి ఎంపికై ంది. మంగళవారం హెచ్‌ఎం వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ ఫుట్‌బాల్ పోటీలలో బాలిక ఉత్తమ ప్రతిభను చాటిందని తెలిపారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీలకు గానవిని ఎంపిక చేశారన్నారు. ఈనెల 25న ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపుర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో గానవి పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు క్రీడాకారిణి గానవి ని, వారి తల్లిదండ్రులను అభినందించారు.
‘నులి’మేద్దాం
ఐరాల : చిన్నపిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులిపురుగులేనని.. ఆల్బెండజోల్ మాత్రలతో నులి పురుగులను నులిమేద్దామని రాష్ట్ర ఆరోగ్యశాఖ జేడీ, ఎన్‌డీడీ ప్రోగ్రాం నోడల్ అధికారి డాక్టర్ సునీల్‌కుమార్‌నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం కాణిపాకం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఆ పాఠశాల హెచ్‌ఎం మోహన్‌కు ఆదేశించారు. 1 నుంచి 19 ఏళ్లు కలిగిన పిల్లలందరూ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని, ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్‌గా త్యాగరాజన్
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర మొదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎస్ త్యాగరాజన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా చిత్తూరు నగరానికి చెందిన సీఎంటీ త్యాగరాజన్‌ను ఈ పదవిలో నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : స్కూల్ గేమ్స్ సెక్రటరీగా రెండేళ్ల నియామకానికి స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీలు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి మంగళవారం పేర్కొన్నారు. 58 ఏళ్లు వయస్సు లోగా ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు వినియోగించుకొని గడువులోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని వివరించారు.
డెత్ క్లెయిమ్స్
పరిష్కారానికి కృషి
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల ఈపీఎఫ్‌కు సంబంధించి డెత్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని కడప రీజియన్ పీఎఫ్ కమిషనర్ రవితేజకుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డెత్ క్లెయిమ్స్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు 9491138280 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బైరెడ్డిపల్లె : కూటలవంక వద్ద మంగళవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గడ్డూరు పంచాయతీ కోట్రేపల్లెకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి (58) బైరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కూటలవంక వద్ద అదుపుతప్పి గాయపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్‌రెడ్డిని స్థానికులు 108 వాహనం ద్వారా పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హత్యాయత్నం కేసులో ప్రియుడు అరెస్ట్
పుంగనూరు : ప్రియురాలి గొంతు కోసిన కేసులో ప్రియుడు వెంకటేష్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు మంగళవారం తెలిపారు. పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్‌లో ఉంటున్న మహిళ గొంతు కోసిన వెంకటేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక