
ఓర్వలేకనే ఎంపీపై అక్రమ కేసులు
వెదురుకుప్పం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎలాగైనా అణిచివే యాలనే కుట్రతో ఎంపీ మిథున్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజయరెడ్డి అన్నారు. ఎంపీ కడిగిన ఆణిముత్యంలా బయటకు రావాలని కోరుతూ మంగళవారం చవటగుంటలోని ఆవుదేవర నందీశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నియో జకవర్గ కార్యదర్శి భీమశంకర్‌రెడ్డి, వైద్యవిభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, మాజీ ఎంపీ పీ మేలిపాటి పురుషోత్తం, సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు దేవరాజులురెడ్డి, మండల యువ త మాజీ అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్లు మునికృష్ణారెడ్డి, జయప్రకాష్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గోవిందరెడ్డి, మాజీ ఎంపీటీసీ మునిరత్నంరెడ్డి, సర్పంచ్ ఆశీర్వాదం, మాజీ సర్పంచ్‌లు చిరంజీవిరెడ్డి, రమేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
సదుం : అక్రమ కేసులతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి తెలిపారు. మండలంలోని రెడ్డివారిపల్లె శ్యాంమతుల ఎల్లమ్మ ఆలయంలో అక్రమ కేసులో అరెస్టు అయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావాలని సర్పంచ్ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేసి ఆలయ ఆవరణలో 101 టెంకాయలను కొట్టారు. ఈ కేసులో ఎంపీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, గిరిధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఆనంద రెడ్డి, శ్రీనివాసులు, వెంకటస్వామి, శివ, మోహన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రమణారెడ్డి, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.