
ఘనంగా సంకటహర చతుర్థి
– పోటెత్తిన భక్తులు
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అ లంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి...ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతంను ఆచరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఈఓ పెంచల కిషోర్, డీఎస్పీ సాయినాథ్, ఏఈవో రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
నేత్రానందం.. స్వర్ణరథం
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడ వీధులలో స్వర్ణ రథ సేవను నేత్రానందంగా నిర్వహించారు.