గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా! | - | Sakshi
Sakshi News home page

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!

Aug 12 2025 7:53 AM | Updated on Aug 13 2025 5:42 AM

గంగమ్

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!

● మిథున్‌రెడ్డి విడుదల కావాలని బోయకొండలో పూజలు ● తరలివచ్చిన పార్టీ శ్రేణులు

మిథున్‌రెడ్డి విడుదల కావాలని బోయకొండలో పూజలు

తరలివచ్చిన పార్టీ శ్రేణులు

చౌడేపల్లె: అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ బోయకొండలో సోమవారం 1,116 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దిగువపల్లె పంచాయతీకి చెందిన నేతలు మునికృష్ణమనాయుడు, కొలింపల్లె గంగిరెడ్డి, లడ్డూరమణ, నరసింహారెడ్డి, ఆనందరెడ్డి, వెంకటరెడ్డి, జీఆర్‌ఎస్‌ రమణ, ప్రసాద్‌నాయుడు, శ్రీనాథ్‌, సుధ, గంగిరెడ్డి, సోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బోయకొండలో నాలుగు కాళ్ల మండపం వద్ద నుంచి మెట్ల మార్గంలో బయలుదేరివెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అభిషేకం, అర్చనలు చేశారు. కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తోందని, మంచి బుద్ధిని ప్రసాదించాలని పూజలు చేశారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా అక్రమ కేసు నుంచి బయటకు వచ్చేలా శక్తిని ప్రసాదించాలని కోరారు. అనంతరం మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, యువకాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు, మండల పార్టీ ఉపాఽఽధ్యక్షుడు వెంకటరమణ, మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు షంషీర్‌, చెంగారెడ్డి, ఓబులేసు, ప్రభాకర్‌ యాదవ్‌, ఓబుల్‌రెడ్డి, శ్రీరాములు, రమేష్‌ బాబు, మణిరాజు, అనుప్రియ, గిరిబాబు, శంకరప్ప, అరుణ, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

మిథున్‌రెడ్డికి బెయిల్‌ రావాలని పూజలు

చిత్తూరు కార్పొరేషన్‌: కక్షలే పాలనగా.. కేసులే పరమావధిగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని దొడ్డిపల్లె సప్తకనికలమ్మ ఆలయంలో మొదలియార్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషే కాలు చేశారు. ఆలయం వెలుపల టెంకాయలు కొట్టి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్‌ రావాలని ప్రార్థించామన్నారు. ఉయ్‌ స్టాండ్‌ ఫర్‌ మిథున్‌రెడ్డి అంటూ పోస్టర్లు చేతబట్టి వారి మద్దతును తెలిపారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ జగనన్నకు ఆప్తుడు అయిన మిథున్‌రెడ్డిపై కక్షగట్టి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని మానసికంగా వేధించాలనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, చుడా మాజీ చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌, జెడ్పీటీసీ బాబునాయుడులు మాట్లాడారు. నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్‌, నాయకులు మధుసూదన్‌, హరిషారెడ్డి, కృష్ణారెడ్డి, లత, బిందు, మనోహర్‌రెడ్డి, మధురెడ్డి, చల్లాముత్తు, శివ, అప్పొజీ, మనోజ్‌రెడ్డి, మదన్‌, త్యాగ, స్టాండ్లీ, గుణ, సత్య, గురుమూర్తి, రాంగణేష్‌, లోక, శివారెడ్డి, చంద్ర పాల్గొన్నారు,

మసెమ్మ ఆలయంలో పూజలు

పుంగనూరు: ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ మసెమ్మ ఆలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, జిల్లా యూత్‌ వింగ్‌ కార్యదర్శి కొత్తపల్లె చెంగారెడ్డి, పీకేఎం మాజీ ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కలసి కొండచెర్ల కురప్పల్లెలో గల మసెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శంకరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నంజుండప్ప, జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, సుబ్బన్న, జయరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, బాబునాయక్‌ పాల్గొన్నారు.

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా! 1
1/2

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా! 2
2/2

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement