కుప్పం: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తామని వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వకర్త, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. సోమవారం బాబు షురిటీ– మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎందరో మాయమాటలు చెప్పారని, అధికారం కోల్పోగానే అడ్రస్ లేకుండా పోయారని చెప్పారు. అందర్నీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బాబు షూరిటీ –మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వాహించాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ప్రజలకు గుర్తుచేయాలన్నారు. అనంతరం నూతనంగా వైఎస్సార్‌సీపీ నియమించినా మున్సిపల్ కమిటీని ఆయన సన్మానించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు హఫీజ్, మురుగేష్, మణి, మునిరాజ్, గుడుపల్లె జెడ్పీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, రామకృష్ణా, కుమారుస్వామి, మురుగేష్ పాల్గొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 45 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌కు 45 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీసు శిక్షణా కేంద్రం డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు.
నివాసం లేని ఇంటికి రూ.28,438 విద్యుత్ బిల్లు
కార్వేటినగరం: నిత్యం ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు పోతున్న ఇళ్లకు రాని విద్యుత్ బిల్లు ఎవరూ కాపురం లేని ఇంటికి రావడంతో స్థానికులు విస్తుపోతున్నారు. పరిశ్రమా.. లేకా ఇల్లా? అన్న అనుమానంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. వివరాలు.. కార్వేటినగరం మండల పరిధిలోని ఎగువరాజులకండ్రిగ గ్రామానికి చెందిన దామోదరరాజు, శాంతమ్మ దంపతులు వారి పిల్లలతో పాటు గత కొన్నేళ్లుగా ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిపడ్డారు. అయితే ఎప్పుడో పండుగలు, శుభ కార్యాలకు మాత్రం స్వగ్రామం ఎగువరాజులకండ్రిగకు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్లేవారు. అయినప్పటికీ విద్యుత్ బిల్లులు సమీప బంధువులు చెల్లిస్తుంటారు. గత నెలలో దామోదరరాజు ఇంటికి విద్యుత్ బిల్లు రూ.64 వచ్చింది. ఆగస్టులో అకస్మాత్తుగా రూ.28,438 బిల్లు రావడంతో ఇంటి యజమాని షాక్ అయ్యారు. ప్రభుత్వ ఆలసత్వం వల్లే విద్యుత్ బిల్లులు ఇలా వస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
విశ్వబ్రాహ్మణులకు లోకేష్ క్షమాపణ చెప్పాలి
పలమనేరు: విశ్వబ్రాహ్మణులకు లోకేష్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షురాలు పవిత్ర డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా లోకేష్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పద్మశాలిలకు రెండు కులవృత్తులుంటాయని, అందులో ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి అని చెప్పడం బాధాకరమన్నారు. కనీసం రాష్ట్రంలోని బీసీ కులాల్లో ఏకులం ఏ కులవృత్తిని చేస్తుందో తెలియక ఆయన తెలివిలేకుండా మాట్లాడడం శోచనీయమన్నారు. విశ్వబ్రా హ్మణుల మనోభావాలను దెబ్బతినేలా లోకేష్ మాట్లాడడం చాలా బాధ కలిగించిందని, దీన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
నిజమైనా కార్యక్తులకు పెద్దపీఠ
నిజమైనా కార్యక్తులకు పెద్దపీఠ
నిజమైనా కార్యక్తులకు పెద్దపీఠ