
పరిశ్రమలకు అత్యంత అనుకూలం
తమిళనాడుకు సరిహద్దులో విజయపురం మండలం ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవసర మైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ఈ ప్రాంతం 48 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయాలు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇదిగాక చైన్నె–తిరుత్తణి జాతీయ రహదారి 2.3 కిమీ దూరంలోనే ఉంది. చైన్నె పోర్టు 45 కి.మీ దూరంలో, కటికపల్లి ఓడరేవు 60 కి.మీ దూరంలో, కామరాజర్ ఓడరేవు 115 కి.మీ దూరంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి రవాణాకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు చైన్నె విమానాశ్రయం 50 కిమీ దూరంలోను, రేణిగుంట విమానాశ్రయం 43 కిమీ. దూరంలో ఉండడంతో పరిపాలనాపరమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే కోసలనగరం వద్ద కోరా ప్యాక్, చైన్నె పార్కింగ్ బ్రిక్స్ పరిశ్రమలను తమిళనాడు నుంచి వచ్చిన వారు ఏర్పాటుచేసుకున్నారు.