భస్మాసురహస్తం! | - | Sakshi
Sakshi News home page

భస్మాసురహస్తం!

Aug 12 2025 7:43 AM | Updated on Aug 13 2025 4:46 AM

భస్మా

భస్మాసురహస్తం!

దేవుడి మాన్యాలు ‘పచ్చ’ నేతల చేతుల్లోకి చిత్తూరులో రూ.50 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం నామమాత్రపు అద్దెలు.. మూడేళ్ల లీజు పేరిట నాటకం ఆపై 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకునేలా ఒప్పందం? టెండరు నోటీసులు ఇవ్వకుండాఅధికారుల డ్రామా కరపత్రాలతో పబ్లిసిటీ ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేసిన వైనం

ఆలయ భూములపై..
● దేవుడి మాన్యాలు ‘పచ్చ’ నేతల చేతుల్లోకి ● చిత్తూరులో రూ.50 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం ● నామమాత్రపు అద్దెలు.. మూడేళ్ల లీజు పేరిట నాటకం ● ఆపై 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకునేలా ఒప్పందం? ● టెండరు నోటీసులు ఇవ్వకుండాఅధికారుల డ్రామా ● కరపత్రాలతో పబ్లిసిటీ ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేసిన వైనం
ఎవడ్రా ఆపేది?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు నగరంలోని కొందరు కూటమి పార్టీ ప్రజాప్రజాప్రతినిధుల కన్ను ఆలయ భూములపై పడింది. ఐదేళ్ల పాటు నిధుల ఆకలితో అల్లాడిపోయిన నేతలు ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేశారు. టెండరు లేదు.. నోటీసు బోర్డులో కరపత్రాలు పెట్టలేదు.. పోటీలేదు.. కానీ వేలం పాట మాత్రం జరిగిపోయినట్లు రికార్డులు సృష్టించేశారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన దేవదాయశాఖ భూముల్ని లీజు పేరిట కారుచౌకగా కొట్టేశారు.

అన్ని వేళ్లూ అధికారుల వైపే

ఈ మొత్తం వ్యవహారంలో దేవదాయశాఖకు చెందిన కొందరు అధికారులు కూటమి నేతలు చెప్పినట్లు తలూపినట్లు స్పష్టమవుతోంది. దేవదాయశాఖకు చెందిన ఏ స్థలాన్ని లీజుకు ఇవ్వాలన్నా ముందుగా పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆపై బహిరంగ వేలం పాట నిర్వహించాలి. ఈ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా భద్రత కోరుతూ డీఎస్పీకి లేఖ రాయాలి. వేలం పాటకు ఒకే వ్యక్తి వచ్చినట్లయితే వాయిదా వేయాలి. వేలం పాట జరిగే ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు చేయించాలి. కానీ అధికారులు ఎవ్వరూ కూడా ఈ నిబంధనలు పాటించలేదు. గుట్టుచప్పుడు కాకుండా కూటమి నేతలకు ఆలయ భూములు అప్పగించేశారు. తొలుత మూడేళ్ల పాటు లీజుకు తీసుకుని.. 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఒప్పందం కుదుర్చుకోవచ్చన్న దురాలోచన కూడా అధికారులే సూచించినట్లు సమాచారం. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అధికారులు కరపత్రాలు ముద్రించి, వీటిని నగరంలోని ఇంటింటికీ పంచిపెట్టినట్లు తప్పుడు రాతలను పుస్తకాల్లోకి ఎక్కించారు. ఆలయ భూములను చెరబట్టిన కూటమి నేతల చేష్టలపై సొంత పార్టీ నాయకులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తుండడం కొసమెరుపు.

చిత్తూరు నగరం హైరోడ్డు ప్రాంతంలో వడ్లమండి సత్రం ఉంది. సత్రం భూమిలో మొత్తం 18 దుకాణాలు ఉండేవి. నెలకు రూ.1.15 లక్షలు ఆదాయం వచ్చేవాటిని రోడ్డు విస్తరణ పేరిట కార్పొరేషన్‌ అధికారులు కూల్చేశారు. రూ.15 కోట్ల విలువ చేసే ఖాళీ స్థలంలో పర్యాటక రంగం పేరిట అభివృద్ధి చేయడానికి భూమిని లీజుకు తీసుకునేందుకు పూతలపట్టుకు చెందిన కూటమి నేత ప్రధాన అనుచరుడు దరఖాస్తు పెట్టుకున్నాడు. బంగారుపాళ్యంకు చెందిన ఆ పచ్చ చేత కన్ను పడ్డ దేవదాయశాఖ స్థలాన్ని విడిపించడం ఎవ్వరితరం కాదనే వాదన వినిపిస్తోంది.

చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలోని వీరాంజనేయస్వామి దేవాస్థానానికి సంబంధించి ఆర్టీసీ వన్‌డిపో సమీపంలో 17 సెంట్ల భూమిని నెలకు రూ.49,700 చొప్పున అద్దెకు తీసుకున్నట్లు గత ఏడాది రికార్డుల్లో నమోదైంది. ఈ స్థలంలో షాపులు కూడా నిర్మించేశారు. ఈ షాపుల ద్వారా నెలవారీ అద్దె రూ.లక్షకు పైనే వస్తుంది. అడ్వాన్సుల కింద రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం. అన్యాక్రాంతంగా ఉన్న భూమి నుంచి అద్దెలు వసూలు చేస్తే తప్పేంటనేది అధికారుల ప్రశ్న.

చిత్తూరు నగరంలోని జీవకారుణ్యసత్రానికి సంబంధించిన 3.3 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. ఓవర్‌ బ్రిడ్జి కింద, రైల్వేస్టేషన్‌–బస్టాండుకు పక్కనే ఉన్న ఈ భూమి విలువ రూ.30 కోట్లకు పైమాటే. ఇంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.75 వేల నామమాత్రపు అద్దెకు అధికారులు లీజుకు ఇచ్చేశారు. త్వరలోనే ఇక్కడ వాణిజ్య సముదాయం, కాంప్లెక్స్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడున్న పురాతనమైన ఈశ్వరుని ఆలయం ఎదుట భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు వేసుకోవాలంటే భక్తులకు అనుమతి ఇవ్వని దేవదాయశాఖ అధికారులు.. అసలు టెండరు ఇవ్వకుండా రూ.కోట్ల విలువచేసే స్థలంలో కాంప్లెక్సులు కట్టడానికి పర్మిషన్‌ ఎలా ఇచ్చారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

భస్మాసురహస్తం!1
1/1

భస్మాసురహస్తం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement