డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌

Aug 12 2025 7:43 AM | Updated on Aug 13 2025 4:46 AM

డీఎస్

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌

● కేటగిరీల వారీగా ఫలితాల వెల్లడి ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 50,502 మంది అభ్యర్థుల ఫలితాలు ● త్వరలో టెట్‌ అభ్యంతరాల ప్రక్రి ● ఆపై ర్యాంకులు, అర్హుల వివరాలు

● కేటగిరీల వారీగా ఫలితాల వెల్లడి ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 50,502 మంది అభ్యర్థుల ఫలితాలు ● త్వరలో టెట్‌ అభ్యంతరాల ప్రక్రి ● ఆపై ర్యాంకులు, అర్హుల వివరాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ 6 నుంచి జూలై 3వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసింది. చిత్తూరు జిల్లా పరిధిలో 33,181 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిన మెలికల కారణంగా చాలామంది పరీక్షలు రాయలేక నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 33,181 మంది దరఖాస్తు చేసుకోగా 30,952 మంది పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో 21,340 మంది దరఖాస్తు చేసుకోగా.. 19,550 మంది పరీక్షలు రాశారు.

ఫలితాలు ఇలా..

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పరీక్షలకు హాజరైన 50,502 మంది అభ్యర్థుల డీఎస్సీ ఫలితాలను ప్రకటించారు. ఆయా అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫలితాలు పొందేలా అవకాశం కల్పించారు. టెట్‌ వెయిటేజీ, డీఎస్సీ మార్కుల స్కోర్లను కలిపి మొత్తం స్కోర్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఫైనల్‌ స్కోర్‌ మాత్రమే ప్రకటించారు. కొందరు టెట్‌ మార్కులు తప్పుగా నమోదు చేయడంతో వాటిని ఎడిట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. తుది ఎంపిక జాబితా అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 1,478 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పేరు : ఎస్‌.భార్గవ

ప్రాంతం :ఐరాల.

పోస్టు : ఎస్జీటీ

మొత్తం స్కోర్‌ :

100 మార్కులకు 80.08

పేరు : ఎం.ప్రశాంత్‌

ప్రాంతం : చిత్తూరు నగరం

పోస్టు : ఎస్జీటీ

మొత్తం స్కోర్‌ :

100 మార్కులకు 82.48

పేరు : కే.మునికుమార్‌

ప్రాంతం : పలమనేరు

పోస్టు : ఎస్జీటీ

మొత్తం స్కోర్‌ :

100 మార్కులు 71.20

పేరు : ఎస్‌. రమేష్‌

ప్రాంతం : కుప్పం

పోస్టు : ఎస్జీటీ

మొత్తం స్కోర్‌ :

100 మార్కులకు 86.36

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌ 1
1/4

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌ 2
2/4

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌ 3
3/4

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌ 4
4/4

డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement