
జాతీయ స్థాయి రగ్బీలో ప్రతిభ
పలమనేరు: జాతీయ స్థాయి రగ్బీలో పలమనేరు పట్టణానికి చెందిన అక్షయ ప్రతిభ చాటింది. ఆసియా రగ్బీ ఎమిరేట్స్ అండర్–20 చాంపియన్‌షిప్ 2025లో ఇండియా మూడో స్థానంలో నిలవడంలో విశేష ప్రతిభ కనబరిచింది. రెండు రోజుల క్రితం బీహార్‌లోని రాజ్‌గిరి ఇంటర్నేషల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సెమీస్‌లో మన జట్టు చైనా చేతిలో ఓడింది. దీంతో కాంస్య పతకం దేశానికి దక్కింది. ఈ జట్టులో పలమనేరుకు చెందిన అక్షయ ఉంది. భవిష్యత్తులో అక్షయ ఇండియన్ మహిళా జట్టులో కీలకం కానుంది. అక్షయ తల్లిదండ్రులైన నర్రా సురేష్, శ్రీదేవీ పట్టుదలతోనే ఆమె జాతీయ స్థాయికి ఎదిగిందని తెలుస్తోంది. ఆమెకు అభినందనల వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేసి సత్తాచాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అంతకుముందు మాజీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామినాయుడు, జోనల్ ఇన్‌చార్జి శివనారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే బాబు పాలన సాగించలేరన్నారు.
చిత్తూరులో చాయ్ పే చర్చ
ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మిట్టూరులో ఓ టీ దుకాణంలో రైతులు, ప్రజలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. అనంతరం కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహనికి, వివేకానంద విగ్రహనికి నివాళులర్పించి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వనాయుడు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి, నాయకులు నిషిద, చిట్టిబాబు, రామభద్ర, షణ్మగం, సత్య పాల్గొన్నారు.

జాతీయ స్థాయి రగ్బీలో ప్రతిభ

జాతీయ స్థాయి రగ్బీలో ప్రతిభ