
వైఎస్సార్‌సీపీలో చేరిన తెలుగు తమ్ముళ్లు
చౌడేపల్లె: తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ఆదివారం చౌడేపల్లె మండలం సింగిరిగుంటలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం పాలన నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. సింగిరిగుంటకు చెందిన ఎం.ప్రకాష్‌నాయుడు, పి.చెన్నకృష్ణ, పి.నగేష్, కె.రాజశేఖర్‌నాయుడు, నుంజార్లపల్లెకు చెందిన పి.నాగరాజనాయుడు, రామయ్యగట్లుకు చెందిన డి.సుజాత వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దామోదరరాజు, మండల పార్టీ అఽధ్యక్షుడు జి.నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, వెంకటరెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచ్ షంషీర్, నాయకులు చెంగారెడ్డి, రమేష్‌నాయుడు, మల్లీశ్వరరెడ్డి, సుబ్రమణ్యం నాయుడు, నాగరాజ, హరి, రమేష్‌బాబు, బాబు తదితరులు పాల్గొన్నారు.
కుట్రలకు తెరలేపిన వైనం..
సింగిరిగుంటలో ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో టీడీపీ కార్యకర్తలు చేరిన విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు కుట్రలకు తెరలేపారు. పార్టీని విడిచిన కె.రాజశేఖర్‌నాయుడు, పి.నగేష్, పి.నాగరాజనాయుడుతో చర్చలు జరిపారు. పుంగనూరు పర్యటన ముగించుకుని మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో రొంపిచెర్లకు వెళ్తున్న చల్లా రామచంద్రారెడ్డి చేత స్థానిక నేతలు మళ్లీ టీడీపీ కండువా వేసి ఆ పార్టీలోకి పిలుచుకున్నారు.
కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి
ిసింగిరిగుంటలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
పార్టీలో చేరిన ఆరుగురిలో ముగ్గురికి మళ్లీ కండువా వేసిన టీడీపీ నేతలు

వైఎస్సార్‌సీపీలో చేరిన తెలుగు తమ్ముళ్లు