
జిల్లా ఆస్పత్రిలో ఫార్మసిస్టుల కొరత
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసిస్టులు (ఫార్మసీ ఆఫీసర్లు) పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్న వారిపైనే అధిక భారం పడుతోంది. జిల్లా ఆస్పత్రిలో అందించే సేవలతోపాటు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోగులకు చికిత్స అందించే వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం ఫార్మసిస్టులకు ఉంది. వైద్యులు రాసి ఇచ్చిన మందులు అందించేది ఫార్మసిస్టులే. అయినా వారిపై ఉన్న పనిభారాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జి ల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మంది ఫార్మసి స్టులు ఉన్నారు. ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సే వలు అందించడానికి 25 మంది ఉండాలి. ఇంకా 15 మ ంది వరకు ఫార్మసిస్టులు అవసరం. పదేళ్ల క్రితం జిల్లా ఆస్పత్రికి 500 నుంచి 600 వరకు ఓపీలు వచ్చేవి. ఇప్ప డు ఓపీల సంఖ్య 1200 వరకు పెరిగింది. ప్రభుత్వం తరపున 450 బెడ్లు, అపోలో తరపున 400 బెడ్లు ఉన్నా యి. ఇన్‌పేషెంట్లు రోజువారీగా 300 నుంచి 350 వరకు ఉంటున్నారు. వీరికి 24 గంటల పాటు ఫార్మసిస్టులు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్నవాళ్లపై భారం పడుతోంది.
గత ప్రభుత్వంలో సకాలంలో పోస్టుల భర్తీ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులను ఎప్పటికప్పడు భర్తీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో 50 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయడం విశేషం. పీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఏ ఆస్పత్రిలోనైనా పోస్టు ఖాళీ అయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవారు. కానీ ఇప్పుడు పోస్టు ఖాళీ అయితే ఏడాదిన్నర అయినా భర్తీ చేసిన దాఖలాలు లేవు.
ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి వెళ్లినా...
చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని మే 5న వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సందర్శించారు. ఆయనకు యూనియన్ నాయకులు ఆస్పత్రి పరిస్థితిని, పోస్టుల భర్తీ ప్రాధాన్యతను వివరించారు. అయినా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.