
మోసాలకు నిలువెత్తు రూపం బాబు
పూతలపట్టు(యాదమరి): మోసాలకు నిలువెత్తు రూపం సీఎం చంద్రబాబు అని.. ప్రజలను వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధి పి.కొత్తకోటలోని శ్రీనివాస కల్యాణ మండపంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసమే ఆచరణ సాధ్యం కాని అబద్ధపు హామీలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని చెప్పారు. అధికారం చేపట్టి ఇప్పటికి దాదాపు ఏడాదిన్నర కాలం కావొస్తున్నా ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్‌సిక్స్ పథకాలలో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా ? అని చంద్రబాబుని ప్రశ్నించారు. సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభ్బుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ప్రజా సంక్షేమంపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గతంలో మునుపెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. కూటమి మోసాలను ప్రజలకు చేరువ చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, నాయకులతో కలిసి క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి అమర్‌నాథ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు జయచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు రాజారత్నంరెడ్డి, గౌహతి సుబ్బారెడ్డి, యువత అధ్యక్షుడు నవీన్, బూసిపల్లి రెడ్డెప్ప, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.