
శభాష్ చిన్నోడా..
చౌడేపల్లె: మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటలు, వాగుల్లోకి వర్షపునీరు చేరుతోంది. ఈ క్రమంలో ఆదివారం నెట్టిబండకు చెందిన రాము కుమారుడు సార్విక్ పొలం వద్దకు వెళ్తుండగా దేవిరెడ్డిచెరువుకు వర్షపునీరు వచ్చే వాగులో పెద్దచేపను గుర్తించాడు. సుమారు గంట సేపు కుస్తీ పడి సుమారు 8 కేజీలు ఉన్న పెద్ద మారవ చేపను అతికష్టం మీద పట్టుకున్నాడు. చిన్నారి పొడవంత సైజు గల చేపను పట్టిన విషయం తెలిసిన స్థానికులు పెద్దచేపను చూసేందుకు క్యూకట్టారు.
పీఏసీఎస్‌లకు కమిటీల నియామకం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 5 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీడీనెల్లూరు సొసైటీ చైర్‌పర్సన్‌గా మోహన్‌నాయుడు, సభ్యులుగా జ్యోతియాదవ్, చవటగుంటకు చైర్‌పర్సన్‌గా బోడిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సభ్యులుగా బీఎం రవి, పి.మనోహర్, పలమనేరుకు చైర్‌పర్సన్‌గా వెంకంటరమణ, సభ్యులుగా పాపిరెడ్డి, రమేష్, రొంపిచెర్లకు చైర్‌పర్సన్‌గా రఘునాథరెడ్డి, సభ్యులుగా శివరెడ్డి, సురేంద్ర, తవణంపల్లికి చైర్‌పర్సన్‌గా అమరేంద్ర నాయుడు, సభ్యులుగా మునీంద్ర, భూపతినాయుడుని నియమించింది. వీరు 2026 జనవరి నెలాఖరు వరకు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.