
అట్టహాసంగా అగ్నిగుండ ప్రవేశం
చెట్లు అడ్డుగా ఉన్నాయట..!
వరుస సెలవులు రావడంతో గుడిపాల మండలం చీలాపల్లె స్కూల్లోని భారీ చెట్లను కొందరు నరికేసి కలపను తరలించారు.
దేవదాయశాఖలో గందరగోళం నెలకొంది. ఆడిట్ల పర్వం అడ్డగోలుగా మారుతోంది. పలువురు ఆడిటర్లు సవాలక్ష కుంటిసాకులు చెప్పి దోపిడీపర్వానికి దిగుతున్నారు. ఫ్రీ ఆడిట్, వార్షిక ఆడిట్ చేసేటప్పుడు వారు అడిగింది ఇస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు. లేకపోతే పెండింగ్ పెడుతున్నారని ఈవోలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రీ ఆడిట్ విధానంలో బిల్లుల అనుమతులకు ఆలస్యమవుతున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు ఆడిట్‌లో బిల్లుల గోల్‌మాల్ బయటపడుతుండడంతో ఆడిట్ అధికారులు లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
● కల్పవృక్షం, సూర్యప్రభ వాహనాలపై విహరించిన ద్రౌపదీదేవి ● బ్రహ్మోత్సవాలకు బ్రహ్మరథం పట్టిన భక్తజనం
భవితకు విజ్ఞాన్ మంథన్
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రో త్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్ మంథన్ పరీక్ష నిర్వహిస్తోంది
సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025
కాణిపాకం: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6ఏ కింద కాణిపాకం, శ్రీకాళహస్తి, బోయకొండ గంగమ్మ, సురుట్టుపల్లిలోని పళ్లికొండేశ్వరస్వామి దేవస్థానం, చంద్రగిరి మూలస్థానమ్మ, తలకోన సిద్ధేశ్వరస్వామి, నగరిలోని దేసమ్మ దేవస్థానం, అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానాలున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి అప్పటికప్పుడు బిల్లులు ఫ్రీ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బిల్లులు మంజూరవుతుంటాయి.
పారదర్శకతకు ఫ్రీ ఆడిట్
ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండేందుకు గత ప్రభుత్వం ఫ్రీ ఆడిట్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి నిర్వహణకు సంబంధించిన బిల్లులు పక్కాగా ఉండాలి. సంబంధిత విభాగ అధికారులు అనుమతి ఉండాలి. అలాగే ఆ శాఖ అధికారి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే ఫ్రీ ఆడిట్‌కు సమర్పించాలి. వీటిని ఆడిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదం ఉంటుంది. పరిశీలనలో తప్పిదాలు కనిపిస్తే తిరస్కరించవచ్చు.
చేయి తడిపితే చాలు!
ఆడిటర్లు ఫ్రీ ఆడిట్ విధానాన్ని కల్పతరువుగా మార్చుకుంటున్నారు. బిల్లులు ఫ్రీ ఆడిట్‌కు వెళ్లిన ప్రతిసారీ ఆమ్యామ్యాలు చెల్లిస్తేనే వారు బిల్లులు పాస్ చేస్తున్నారని, లేదంటే పెండింగ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పలువురు ఈవోలు ఆరోపిస్తున్నారు. ఫ్రీ ఆడిట్లో ఏదో తంటాలు పడి బిల్లులు పాస్ చేయించుకుంటే వార్షిక ఆడిట్‌లో మళ్లీ మొదటికి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ ఆడిట్ పాస్ అయిన బిల్లులు వార్షిక ఆడిట్లో ఎందుకు పాస్ కావడం లేదంటే మళ్లీ అదే బిల్లులకు సంబంధించి ఆడిటర్లకు అడిగింది సమర్పిస్తేనే పాస్ అవుతున్నాయన్నది సమాచారం.
మాముళ్ల తలనొప్పి
ఫ్రీ ఆడిట్లో ఆడిటర్లకు మామూళ్లు ఇచ్చి మళ్లీ వార్షిక ఆడిట్లో ఆడిట్ క్లియర్ చేసుకునేందుకు మళ్లీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం తలకు మించిన భారంగా ఉందని ఈవోలు ఆరోపిస్తున్నారు. ఫ్రీ ఆడిట్లో అనుమతి ఇచ్చిన ఆడిటర్లు వార్షిక ఆడిట్లో అభ్యంతరం వ్యక్తం చేయడం ఆ శాఖ అధికారుల అవినీతికి పరాకాష్టగా ఉందని ఈవోలు చెబుతున్నారు. ఇదేవిషయాన్ని దేవదాయశాఖ ఈవోల సంఘం ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఫ్రీ ఆడిట్ చేసి అనుమతిచ్చిన తర్వాత నిజంగా ఆ వ్యయం సరైనది కాదని భావించి వార్షిక ఆడిట్లో అభ్యంతరం వస్తే వాటిపై ఫ్రీ ఆడిట్ చేసిన వారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాల్సిన ఆడిట్‌శాఖ రాష్ట్ర అధికారులు అవేమీ పట్టించుకోకుండా తమను బాధ్యులను చేయడం ఏ మిటని ఈవోలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సత్వర చర్యలు తీసుకుని ఆడిటర్ల ధనదాహానికి అడ్డుకట్టవేయాలని ఈవోలు కోరుతున్నారు.
కాణిపాకం దేవస్థానం
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలీసుశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే ఉదయం 10.30 నుంచి వినతులు, ఫిర్యాదులు అందించవచ్చని పేర్కొంది.
నేడు పులిచెర్లలో
పీజీఆర్‌ఎస్
చిత్తూరు కలెక్టరేట్/రొంపిచెర్ల: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ నెల 11న పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులిచెర్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం పులిచెర్ల మండలంలో నిర్వహించబడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
కాణిపాకంలో పలువురు ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక విచ్చేశారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుపతి తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది వాసు, చిట్టిబాబు, ఎస్‌ఐ నరసింహులు పాల్గొన్నారు.
మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని పూజలు
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డికి బెయిల్ రావాలని గ్రామ సమీపంలోని చప్పిడిపల్లి గంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో వైఎస్సార్‌సీపీ నేతలు జే అమరనాథ రెడ్డి, మనోజ్‌రెడ్డి, మునిత్నం నాయుడు, రమేష్‌రెడ్డి, ధనుంజయ పాల్గొన్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
జిల్లా దేవదాయశాఖలో ఆడిట్ గోల్‌మాల్
దోపిడీ పర్వానికి దిగుతున్న ఆడిటర్లు కమీషన్లు ఇవ్వకుంటే బిల్లులు పెండింగ్ లబోదిబోమంటున్న ఈఓలు పట్టించుకోని దేవదాయశాఖ ఉన్నతాధికారులు
కొర్రీలు పెడుతున్నారు
ఫ్రీ ఆడిట్‌కు వెళ్లినప్పుడు ఎలాంటి కారణాలు లేకుండానే బిల్లులు పెండింగ్ పెడుతున్నారు. వాస్తవానికి వాటిపై అనుమానాలు ఉంటే వెనక్కి కానీ తమ వద్దే ఆ బిల్లులు పెట్టుకుంటూ ఈవోలను పీడిస్తున్నారు. వారు అడిగింది సమర్పిస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారని ఈవోలు చెబుతున్నారు. దీనివల్ల బిల్లులు పెట్టిన ప్రతిసారీ డబ్బులు చెల్లించాల్సి రావడంతో అప్పులపాలవుతున్నామని వివిధ ఆలయాల అధికారులు వాపోతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం
ఆలయ కేటగిరీ సంఖ్య
6ఏ 9
6బీ 47
6సీ 3,130
6డీ(మఠాలు) 33
భూముల వివరాలు
బీడు భూములు – 4,801.11 ఎకరాలు
వ్యవసాయ భూమి – 14,987.20 ఎకరాలు
ఇతర భూమి – 4,610.21 ఎకరాలు
మొత్తం – 24,398.52
ఆడిటర్ల వాదన ఇలా..
పలువురు ఆడిట్ అధికారులు ఆలయ అధికారులు ఇచ్చే బిల్లుల్లో గోల్‌మాల్ ఉంటోందని ఆరోపిస్తున్నారు. వాటి లెక్క తేలిస్తే తమను తప్పుబడుతున్నారని వాపోతున్నారు. బిల్లులు లేవని తిరస్కరిస్తే తప్పు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. బిల్లులు చూస్తే... చేసేది గోరంతా..చూపేది కొండంత అన్న చందంగా ఉందని బహిరంగంగా చెబుతున్నారు.

అట్టహాసంగా అగ్నిగుండ ప్రవేశం

అట్టహాసంగా అగ్నిగుండ ప్రవేశం

అట్టహాసంగా అగ్నిగుండ ప్రవేశం

అట్టహాసంగా అగ్నిగుండ ప్రవేశం

అట్టహాసంగా అగ్నిగుండ ప్రవేశం