
జిల్లాను వీడని వర్షాలు
జీడీ నెల్లూరులో భారీ వర్షం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కూడా జిల్లా లో పలుచోట్ల భారీ వర్షం పడగా.. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. చిత్తూరులో మాత్రం బలమైన వర్షం పడింది. పూతలపట్టులో పలుచోట్ల మోస్తారు వర్షం కురిసింది. పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో తేలికపాటి వర్షం పడింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల వాగులు, వంకలు ప్రమాదకరంగా మార డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చెరువులకు సైతం వర్షపు నీరు చేరుతోంది. పంట పొలాలు వర్షపు నీటితో తడిసి ముద్దవుతున్నాయి. వరి పంట నేలకొరుగుతోంది. పలమనేరు, పుంగునూరు ప్రాంతాల్లో సాగులో ఉన్న టమాటాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కాయలపై నల్లమచ్చలు పడే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూరగాయ పంటలు, మల్బరీ సాగుకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని వాపోతున్నారు.
ఐదురోజులుగా ఎడతెరిపి లేని వాన
పలుచోట్ల భారీ వర్షం..కొన్నిచోట్ల తుంపర్లు
వాగులు.. వంకల్లో నీరు
సాగులో ఉన్న పంటలకు దెబ్బ

జిల్లాను వీడని వర్షాలు