
ఉద్యోగులకిచ్చిన హామీలు ఏమయ్యాయి?
నగరి : ‘ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇచ్చిన హామీ లు ఏమయ్యాయి.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’..అని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ ప్రశ్నించారు. శనివారం నగరి పట్టణంలో డివిజనల్ కన్వీనర్ గిరిబాబు అధ్యక్షతన ఎస్‌టీయూ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అధి కారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో డీఏలు ఇస్తామని, మెరుగైన వేతన సవరణ చేస్తామని హామీలు ఇచ్చి న ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింద న్నారు. బోధనేతర పనులు మితిమీరి ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. దీని ప్రభావం బోధనపై పడే ప్రమాదం ఉందన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా కొనసాగించాల ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరగొండ హే మచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. పదోతరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రకరకాల యాప్‌ల పేరుతో టీచర్లు బోధనేతర పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ , ఏపీజీఎల్‌ఐ ఖాతాల నుంచి రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌టీయూ నాయకులు నాగభూషణం, రమేష్, బొబ్బిలిరెడ్డి, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, మోహన్, సుబ్రమణ్యం పిళ్లై, గుణశేఖర్, అమరనాథ్, వెంకట్, వసంత్, వేణుప్రసాద్, చిరంజీవి, లక్ష్మీపతి పాల్గొన్నారు.
మెరుగైన వేతనాలు, డీఏలు ఎందుకు ఇవ్వడం లేదు
ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు
మండిపడ్డ రాష్ట్రోపాధ్యాయ సంఘం