
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే ఈ కార్డెన్ సెర్చ్ పేరిట తనిఖీలు చేపట్టారు. నేరాలను ముందస్తుగా గుర్తించి అరికట్టడమే కార్డెన్ సెర్చ్ లక్ష్యమని చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. వాహనాల తనిఖీ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించడం, అసాంఘి కార్యకలాపాలు నిరోధించడానికి ఇలాంటి తనిఖీలు ఉపయోగపడుతాయన్నారు. ఈ తనిఖీల్లో జిల్లాలో సరైన రికార్డులు లేనటువంటి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, 30 కర్ణాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఏఎస్పీ తెలిపారు.