‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా? | - | Sakshi
Sakshi News home page

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

Aug 10 2025 5:39 AM | Updated on Aug 10 2025 5:39 AM

‘అక్ర

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

రాష్ట్రంలో అరాచక పాలన
రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ధ్వజమెత్తారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రభుత్వం ఉన్నది గాడిదలు కాయడానికా?
మహిళలు, దళితులను కాపాడలేరా?
● రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోయాయి ● ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు రాజ్యమేలుతున్నాయి ● సీపీఐ 24వ జిల్లా మహాసభలో జాతీయ కార్యదర్శి నారాయణ
కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌
● గుట్టువిప్పని అధికారులు ● ఇందులో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసేవారే కీలకం ● చిత్తూరు కేంద్రంగా మరిన్ని అక్రమాలు ● రెచ్చిపోతున్న తమిళనాడు నకిలీ డాక్టర్లు
కూలికొస్తే..కొడుకే పోయాడు!
● పైపులైను గుంతలో పడి రెండేళ్ల బాలుడి మృతి ● కూలి పనుల కోసం వచ్చి కన్నబిడ్డను పోగొట్టుకున్న దంపతులు ● పలగార్లపల్లెలో విషాదం

పౌర్ణమి పూజలు

కాణిపాకంలోని వరసిద్ధుడి క్షేత్రంలో శనివారం శ్రావణ పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. హుందాగా వ్యవహరించాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలకు తెరదీస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేసింది. 2022–23వ సంవత్సరం నుంచి వరుసగా రెండేళ్ల పాటు ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేసింది. ఆ ట్యాబ్‌ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో బోధించేవారు. పిల్లలు కూడా కూలంకషంగా నేర్చుకునేవారు. రోజూ పాఠశాలకు తీసుకొచ్చి తరగతి గదిలో టీచర్లు బోధించే పాఠ్యాంశాలను విని.. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తమతో పాటు ట్యాబ్‌లను తీసుకెళ్లేవారు. పాఠశాలల్లో ట్యాబ్‌ల వినియోగానికి ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నారు. కనీస పర్యవేక్షణ, సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ లేకపోవడంతో అవి మూలనపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

లీప్‌ యాప్‌లో వీడియోలు

ఇటీవల కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లీప్‌ యాప్‌లో వీడియోలను రూపొందించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఆ వీడియోల పాఠాలను టీచర్లు తరగతి గదిలో డిజిటల్‌ ప్యానల్‌ టీవీ ద్వారా బోధిస్తున్నారు. అయితే ట్యాబ్‌ల విషయం మరిచిపోయారు. అంతేగాక ట్యాబ్‌లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో చాలావరకు పనిచేయడం లేదు. కొన్ని అసలు ఆన్‌ కావడం లేదు. ఎక్కడైనా టీచర్లు చొరవ తీసుకుని ట్యాబ్‌ల ద్వారా బోధిద్దామని యత్నించినా సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ కాక పనిచేయడం లేదు. ట్యాబ్‌లను సరఫరా చేసిన టెక్నీషియన్‌లు పర్యవేక్షించే విభాగాన్ని మూసివేయడంతో అసలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీనిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

బోయకొండలో చండీ హోమం

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని యాగశాల లో నెలకొల్పారు. ఈఓ ఏకాంబరం తోపాటు ఉభయదారులచేత ప్రత్యేక పూజలు, అర్చన లు, అభిషేక పూజలు నిర్వహించారు. ప్రతినె లా పౌర్ణమి రోజున నిర్వహించే ఈ చండీ హో మ పూజలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. పాకాల న్యాయస్థానం న్యాయమూర్తి పూర్ణాదేవి దంపతులు హాజరయ్యారు. పూర్ణాహుతి అనంత రం అధికారులు ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కేంద్ర బృందం పరిశీలన

పెద్దపంజాణి: మండలంలోని కోగిలేరు సచివాలయం పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అమలవుతున్న పథకాలను జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం శనివారం పరిశీలించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, హౌసింగ్‌, పింఛన్లు, స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరుపై లబ్ధిదారులతో చర్చించింది. నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరింది. స్పందించిన స్థానికులు ఉపాధి హామీ పనులు చేయడానికి పనిముట్లు ఇవ్వాలని, దినసరి వేతనం పెంచాలని తమ అభిప్రాయాలను తెలియజేశారు. జాతీయ స్థాయి పర్యవేక్షణ కమిటీ అధికారులు సునీల్‌, మణికంఠన్‌, ప్రశాంత్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ శారదాదేవి, సర్పంచ్‌ రమేష్‌ బాబు, ఏపీఓ మురుగేషన్‌, ఏపీఎం నీరజ, పంచాయతీ కార్యదర్శి బాలాజీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ పోస్టుల ప్రాథమిక జాబితా విడుదల

తిరుపతి సిటీ: మెగా డీఎస్సీలో క్రీడా కోటా ఉపాధ్యాయ పోస్టుల ప్రాథమిక జాబితాను శాప్‌ అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. జిల్లాలో స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికై న అభ్యర్థులు శాప్‌ విడుదల చేసిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపనున్నారు. ఇప్పటికే డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూరైన విషయం తెలిసిందే.

నగరి : ‘రాష్ట్రంలో మహిళలు, దళితులను కాపాడలేని ప్రభుత్వం ఉన్నది ఎందుకు.. గాడిదలు కాయడానికా’..? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీపీఐ 24వ జిల్లా మహసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. మహిళలపై తరచూ లైంగికదాడులు జరుగుతున్నాయని, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. ఏ కార్యాలయానికి వెళ్లినా లంచాలు రాజ్యమేలుతున్నట్టు పేర్కొన్నారు. కొండలకు గుండు కొట్టేస్తున్నారన్నారు. కంకర, గ్రావెల్‌, ఇసుక, మైన్స్‌ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నట్టు ఆరోపించారు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తానని హామీ ఇచ్చారని ఆ మేరకు ఉచిత విద్యుత్‌ సక్రమంగా అమలుచేసినందునే మళ్లీ ఆయనను గెలిపించారన్నారు. నేడు కొన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అంటున్నా వారు పెట్టే స్మార్ట్‌ మీటర్లు విష్ణుచక్రాల్లా తిరుగుతున్నట్టు ఆరోపించారు. ప్రజలకు నష్టం చేకూర్చే స్మార్ట్‌ మీటర్లు పగులగొడతామని హెచ్చరించారు.

బీసీలు, ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

బీసీలు 52 శాతం ఉన్నారని వారికి ఎస్సీలకు కేటాయించినట్లు చట్టసభల్లో రిజర్వేషన్‌ ఇవ్వాలన్నారు. వెనుకబడిన వర్గాలు ఉన్నది పల్లకీ మోయడానికి మాత్రమే కాదన్నారు. మహాసభలను పురస్కరించుకొని ఓంశక్తి ఆలయం నుంచి బస్టాండు ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి పీ.హరినాథ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, సహాయ కార్యదర్శి టీ.జనార్ధన్‌, నగరి నియోజకవర్గ కార్యదర్శి ఏ.కోదండం, పట్టణ కార్యదర్శి వేలన్‌, నాయకులు బషీర్‌ బాషా, మురళి, శేఖర్‌, సుబ్రమణ్యం, విజయ్‌, చినరాజ్‌, ముత్తు, యేసు, సతీష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజనులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించుకోవాలన్నారు. ఆదివాసీ యువత తమ సంప్రదాయ, సాంస్కృతిక మూలాలకు క్రమంగా దూరమవుతున్నారన్నారు. జిల్లాలో 50 వేల జనాభా గిరిజనులున్నట్లు తెలిపారు. దాదాపు 600 నివాస ప్రాంతాలలో మౌలిక వసతులను గుర్తించామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతుల పెంపునకు రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. గిరిజనులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తనను నేరుగా కలువవచ్చని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి మాట్లాడుతూ గిరిజనులు అటవీ ప్రాంతాల్లో సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఇంటి పట్టాలు లేని గిరిజనులు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గిరిజనులకు ఎటువంటి సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పాడెల్‌ మాట్లాడుతూ గిరిజనులు తమ పిల్లలను బడికి పంపించి చదివించాలన్నారు. అనంతరం ముగ్గురు గిరిజనులకు రూ.2,20,293 అందించారు. సోమల, తవణంపల్లి మండలాల్లోని 22 మంది గిరిజనులకు 19.99 ఎకరాల భూస్వామ్య పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ అముద, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు మునీంద్రనాయక్‌, కృష్ణానాయక్‌, చిరంజీవి, సుబ్బరాజు, దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

గత ప్రభుత్వ హయాంలో ట్యాబ్‌లతో బోధన

గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

ప్రస్తుతం పట్టించుకోని కూటమి నేతలు

సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో పనిచేయని ట్యాబ్‌లు

మండిపడుతున్న తల్లిదండ్రులు

జిల్లా సమాచారం

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు – 1,923

ప్రాథమికోన్నత పాఠశాలలు – 181

ఉన్నత పాఠశాలలు – 330

మొత్తం పాఠశాలలు – 2,434

1 నుంచి 10వ తరగతి వరకు

విద్యార్థులు – 1,31,754

రెండేళ్ల పాటు విద్యార్థులకు

అందజేసిన ట్యాబ్‌లు – 42,044

ఖర్చు చేసిన మొత్తం – రూ.126.13 కోట్లు

ప్రస్తుతం పనిచేయని ట్యాబ్‌లు – 13,458

‘ప్రతి పిల్లవాడు ఉన్నతంగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యకు వెన్నుదన్నుగా నిలిచింది. సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఉచితంగా అందజేసింది. వీటి ద్వారా విద్యార్థులు సమోన్నతంగా ఎదిగేలా కృషి చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయని ట్యాబ్‌లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తలలుపట్టుకోవాల్సి వస్తోంది.

పర్యవేక్షించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇచ్చిన విలువైన ట్యాబ్‌లు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్‌లను ఇవ్వడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. విద్యాభివృద్ధి విషయంలో పర్యవేక్షణ లోపం ఉండడం సరైన పద్ధతి కాదు. వెంటనే ట్యాబ్‌లకు మరమ్మతులు చేయాలి. – శివారెడ్డి.

ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి

విద్యార్థులకు ఉపయోగం

గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లు ఎంతో ఉపయోగకరమైనవి. దేశంలో ఎక్కడా విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చిన పాపానపోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేసింది. 2023–24 సంవత్సరంలో ట్యాబ్‌లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నారు. అయితే వారికి అందజేసిన ట్యాబ్‌లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి.. వాటిని సరిచేయించాలి.

– హేమారెడ్డి, రిటైర్డ్‌ హెచ్‌ఎం, కత్తెరపల్లి గ్రామం, కార్వేటినగరం మండలం

ఒక్కో ట్యాబ్‌కు రూ.30 వేలు ఖర్చు

జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వంలో రెండేళ్లపాటు ఒక్కో ఏడాదిలో 21,022 మంది విద్యార్థుల చొప్పున 42,044 మందికి ఉచితంగా ట్యాబ్‌లను అందజేశారు. ఇందులో బైజూస్‌ కంటెంట్‌తో కూడిన వీడియోలను పొందుపరిచారు. ఇవి పదో తరగతి వరకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ఒక్కో ట్యాప్‌పై సుమారు రూ.30 వేల దాకా ఖర్చుచేశారు. 2023–24లో ఎనిమిదో తరగతి చదివే సమయంలో ట్యాబ్‌లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లు సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో మొరాయిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. సమస్యను టీచర్లు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదు.

గిరిజనులు సంక్షేమ పథకాలను

సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టరేట్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఏ సమస్య వచ్చినా నన్ను నేరుగా కలవొచ్చు

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ వెల్లడి

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?1
1/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?2
2/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?3
3/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?4
4/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?5
5/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?6
6/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?7
7/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?8
8/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?9
9/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?10
10/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?11
11/11

‘అక్రమ స్కానింగ్‌’ అంతేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement