
ఎరుపెక్కిన నగరి
● మొదటిసారి జిల్లా 24వ సీపీఐ మహాసభ
నగరి : భారత కమ్యూనిస్టు పార్టీ చిత్తూరు జిల్లా మహాసభలకు మొదటి సారిగా నగరి పట్టణం వేదికకానుంది. ఈనెల 9, 10 తేదీల్లో 24వ జిల్లా మహాసభలు కామ్రేడ్ వసుమతి దేవి ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 9వ తేదీన పట్టణంలో ఓంశక్తి గుడి నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి డి.జగదీష్, పి.హరినాథ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు హాజరుకానున్నారు. 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రతినిధులతో వసుమతి దేవి హాల్‌లో సభ నిర్వహించనున్నారు. శుక్రవారం నగరిలో సమావేశమైన రాష్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు, సహాయ కార్యదర్శి టి.జనార్ధన్, నగరి నియోజకవర్గ కార్యదర్శి ఎ.కోదండం పలు నిర్వహణ కమిటీలను నియమించుకుని మహాసభ దిగ్విజయం కోసం ఏర్పాట్లను ముమ్మరంగావించారు.