
మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని ప్రత్యేక పూజలు
పలమనేరు: ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని కో రుతూ పట్టణంలోని మారెమ్మ ఆలయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం 101 కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ హేమంత్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా తన చిరకాల శత్రువైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. ఇందులో భాగంగానే ఆయన తనయుడు మిథున్ రెడ్డి పై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపారన్నారు. ఎన్ని కుట్రలు జరిగినా న్యాయస్థానంలో తప్పకుండా ఆయనకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 12న ఆయనకు బెయిల్ రావాలని పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. నాయకులు మండీసుధా, ప్రహ్లాద, సోమచంద్రారెడ్డి, రఘునాథ్, కోదండరామయ్య, శ్యామ్‌సుందర్, నాగరాజ్, ప్రసాద్, పవన్, చేపల బాబు, నరేష్, రవి, ఈశ్వర్‌రెడ్డి, జగదీష్, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.