
ట్రాన్స్‌కోకు రూ.3 లక్షల నష్టం
చిత్తూరు కార్పొరేషన్: గాలీవాన కారణంగా ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈమేరకు నగర సబ్‌డవిజన్ పరిధిలోని మిట్టూరు సెక్షన్‌లో కరెంటు స్తంభం, సంతపేటలో 100 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు 2 నేలవాలాయన్నారు. గుడిపాల సబ్‌డివిజన్‌లో చిత్తూరు రూరల్ సెక్షన్‌లో 4 కరెంటు స్తంభాలు, 220 కేవీ సబ్‌స్టేషన్‌లో టవర్ లైన్ కట్ అయ్యిందన్నారు. రెడ్డిగుంట సెక్షన్‌లో 4 పోల్స్, ఒక 25 సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిన్నట్టు తెలిపారు. బంగారుపాళ్యంలో 2 కరెంటు స్తంభాలు, అరగొండ 3 కరెంటు స్తంభాలు, 125 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్, ఐరాలలో 11 కేవీ ఇన్సులేటర్లు 5 నేలవాలినట్టు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.

ట్రాన్స్‌కోకు రూ.3 లక్షల నష్టం

ట్రాన్స్‌కోకు రూ.3 లక్షల నష్టం