
పాఠశాలను కూల్చి.. ఆర్వో ప్లాంటు ఏర్పాటు
విజయపురం : స్థానిక టీడీపీ నాయకులు పాఠశాలను కూల్చేసి ఆర్వో ప్లాంట్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. విజయపురం మండలం మల్లారెడ్డి కండ్రిగ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రెండు తరగతి గదులు ఉన్నాయి. ఒక గదిలో విద్యార్థులు చదువుకుంటుండగా మరో గదిలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అయితే కొందరు టీడీపీ నాయకులు అంగన్‌వాడీ కేంద్రాన్ని మూయించేసి, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కోసం గోడలను పగులు కొట్టి, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. స్థానిక హెచ్‌ఎం, ఎంఈవో సైతం ఎంత చెప్పినా వినకుండా వారిని బెదిరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే సైతం ఇవేవీ పట్టించుకోకుండా ఆర్వో ప్లాంటు ప్రారంభించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలను కూల్చి.. ఆర్వో ప్లాంటు ఏర్పాటు