
ఆధునికతతో చేనేత పోటీ
చేయూతనిస్తే మరింత అభివృద్ధి
ప్రభుత్వం చేయూతనిస్తే మరింత అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలుస్తామని లబ్ధిదారులు పేర్కొన్నారు.
బీసీలంటే చంద్రబాబుకు చులకన!
బోయకొండ..జన దండు
బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. వరలక్ష్మి పూజల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది.
శుక్రవారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2025
టాస్క్‌ఫోర్స్ : అధికారమే అండ.. సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను దోచుకుంటున్న కూటమి నేతలు ఊరికి ఉపయోగపడే చెరువులనూ వదలడం లేదు. నేడు కోట్ల రూపాయలు విలువ చేసే చెరువు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. చిత్తూరు కలెక్టరేట్‌కు సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెనుక వైపు ఉన్న చెరువును ఆక్రమించుకునేందుకు మట్టి తోలి చదునుచేశారు. ఒకటిన్నర ఎకరా చెరువును పూర్తిగా చదును చేసి ఆక్రమించేందుకు స్కెచ్ వేశారు. ఈ ఆక్రమణ విషయంపై పలువురు ప్రజలు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఆ శాఖ అధికారులు తమకేమి తెలియదన్నట్లు మిన్నుకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ నాయకులతో కుమ్మకై ్క ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.
రియల్ ఎస్టేట్ కోసమే చెరువుల ఆక్రమణ
అధికారంలో ఉండే కొంత మంది పెద్దల సహకారంతోనే చెరువుల ఆక్రమణ తతంగం సాగుతోందని ప్రచారం సాగుతోంది. అధికారంలో ఉన్న వారే చెరువులు కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటుంటే అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. అంతే తప్ప వాటిని కాపాడే ప్రయత్నం ఏ మాత్రం చేయడం లేదు. నగర సరిహద్దులో ఉన్న చెరువుల ఆక్రమణ పెరిగి కుంచించుకు పోతున్నాయి. వందల ఎకరాల్లో ఉండే పెద్ద పెద్ద చెరువులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.
ప్రేక్షకపాత్ర వహిస్తున్న అధికారులు
చెరువులు ఆక్రమిస్తున్నా..పరిరక్షించాల్సిన రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న పచ్చనేతలు ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చెరువు గర్భంలో మట్టి వేసేసి సొంతం చేసుకుంటున్నారు. నిబంధనలకు పాతరేస్తూ కబ్జాలకు తెరలేపుతున్నారు. అధికారంలోని ఉన్నది కూటమి ప్రభుత్వం తమను ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో దందాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఎస్‌ఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ఆక్రమణకు గురై కుంచించుకు పోయిన చెరువు
ఇంజినీరింగ్ ఉద్యోగాలకు 37,121 దరఖాస్తులు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలోని 57 ఉద్యోగాలకు సంబంధించి 37,121 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి ప్రశ్న పత్రం ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా టీటీడీలోని కీలక విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసే విషయంలో రెగ్యులర్, తాత్కలిక డెప్యూటేషన్ పద్ధతిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నియమించిన కమిటీ సమర్పించిన నివేదిక ద్వారా ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. స్వీమ్స్ ఆస్పత్రిలో 128 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు రిజిష్టార్, ఇతర విభాగాల అధికారుల నియామకానికి టీటీడీ అధికార యంత్రాంగం నిర్ణయించింది.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,144 మంది స్వామివారిని దర్శించుకోగా 28,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
విద్యుత్ ఏఓగా బాలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా విద్యుత్ ఏఓ (అకౌంట్స్ ఆఫీసర్)గా బాలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని అధికారులు, ఉద్యోగులు ఆయనను పరిచయం చేసుకొని మాట్లాడారు. గతంలో చిత్తూరు డివిజన్‌లో జేఏఓగా పనిచేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతకు ముందు ఏఓగా ఉన్న ప్రసన్న ఆంజనేయులను ఎస్‌ఏఓగా పదోన్నతి రావడంతో కడపకు బదిలీ అయ్యారు.
రేపు సత్యనారాయణ వ్రతం
కాణిపాకం : పౌర్ణమిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరదరాజ స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఈ వ్రతం జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
12న సంకటహర గణపతి వ్రతం
కాణిపాకం : ఈనెల 12న కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సంకటహర గణపతి వ్రతంను నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆస్థాన మండపంలో ఉదయం 10 నుంచి 11గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటలకు వరకు వ్రతం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
‘విద్యాశక్తి’ వాయిదా వేయండి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యాశక్తి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాశక్తి కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని అధికారులు ఆదేశించడం అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. నూతన కేడర్ స్ట్రెంత్ ప్రకారం టీచర్లకు ఒక పీరియడ్ మాత్రమే లీజర్ దొరుకుతుందన్నారు. రోజంతా నిమిషం తీరక లేకుండా పాఠశాలలో టీచర్లు సతమతమవుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో మరో గంట పాటు అదనంగా తరగతులు నిర్వహించాలని ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదన్నారు. టీచర్లకు విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం చేయాలన్నారు. విద్యార్థులు సైతం పాఠశాల సమయం కాగానే ఆసక్తి లేక ఇళ్లకు వెళ్లేందుకు మక్కువ చూపుతారని తెలిపారు. బలవంతంగా విద్యార్థులను నిర్భంధం చేయడం టీచర్లకు సాధ్యపడదన్నారు. ఈ విద్యాశక్తి కార్యక్రమాన్ని జనవరి నుంచి అమలు చేయాలని, అంత వరకు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చిత్తూరు, కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి దాష్టికమని ఆ పార్టీ బీసీ నేతలు ఖండించారు. గురువారం స్థానిక జ్యోతిరావ్ పూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, పాల ఎకరి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రాజా, రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేమని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నల్లగొండువారి పల్లెలో కొంత మంది నాయకులను కలవడానికి వెళ్లిన వారిపై వంద మంది టీడీపీ అల్లరిమూకలు దాడి చేయడం బాధాకరమన్నారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్సీ నాయకులతో మాట్లాడటానికి వెళ్తే తప్పేమిటన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి పాలన ఎలా సాగుతుందో ప్రజలు గమనిస్తున్నారని నగర బీసీ విభాగం అధ్యక్షుడు నారాయణ, జిల్లా బీసీ విభాగ కార్యదర్శి నవీన్ యాదవ్ గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు త్యాగ, జిల్లా బూత్‌కమిటీ ఉపాధ్యక్షుడు రాంగణేష్ నాయకులు శరవణ, చంద్ర, అశోక్, వినోద్. మురళీ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేనప్పటికీ ఒక తరం నుంచి మరో తరానికి చేనేత నైపుణ్యాలు అందుతూ వచ్చాయని డీఆర్‌వో మోహన్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్‌వో మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి చేనేత రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు. నేత కార్మికులు కాళ్లు, చేతులు, కళ్లను మగ్గాలపై కేంద్రీకరించి అకుంఠిత దీక్షతో వస్త్రాలను తయారు చేస్తారన్నారు. ఆధునిక కాలంతో చేనేత రంగం పోటీ పడుతోందన్నారు. చేనేత మన దేశ సంస్కృతికి, స్వాతంత్య్ర ఉద్యమ భావనలకు, కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచిందన్నారు. యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి మెరుగవుతుందన్నారు. చేనేత కార్మికులు ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో చెరువు ఆక్రమణ
చదును చేసి ఆక్రమించుకుంటున్న టీడీపీ నేతలు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తంతు
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
కనుమరుగవుతున్న చెరువులు
పర్యావరణం, భూగర్భ జలాల పరిరక్షణతో పాటు ప్రజల దాహార్తి తీర్చేలా దూరదృష్టితో ఏర్పాటు చేసిన చెరువులు కూటమి నేతల చెరలో పడి కనుమరుగవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొ రవడి రూ.కోట్ల విలువ చేసే చెరువుల భూములు నే డు పెద్ద వ్యాపారంగా మారాయి. దీంతో నగరంలో భూగర్భ జలాలు భవిష్యత్తులో తగ్గిపోయే ప్రమాదం ఉందని వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురై కొన్నేళ్లల్లో మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
జిల్లా కేంద్రం పరిధిలో కబ్జాకు గురైన చెరువుల వివరాలు ఇలా..
చెరువు పేరు ఉన్నది కబ్జా అయ్యింది
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
తిమ్మసముద్రం
కస్తూరినాయునిచెరువు 31.57 2
తేనెబండ కొత్తచెరువు 10.22 4.50
తిమ్మసముద్రం
బుద్దేయల చెరువు 16.50 2
తిమ్మసముద్రం
కొత్తచెరువు 20.36 1.50
నరిగిపల్లె పెద్దచెరువు 15.45 6.75
77 గాండ్లపల్లె
కట్టమంచి చెరువు 54.96 1.50
ఇరువారం
జడియం చెరువు 56.4 1.25
మురకంబట్టు
అగ్రహారం చెరువు 73.38 4.50
గిరింపేట
కుమ్మరవానికుంట 5.40 2.34
గిరింపేట
భవానీశంకర్‌చెరువు 28.71 3.74
గిరింపేట
గంగినేనిచెరువు 45.43 10
మాపాక్షి పెద్ద చెరువు 36.38 4.16
అనుపల్లె పెద్దచెరువు 14.94 5.10
చిత్తూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న చెరువు టీడీపీ నేతల చెరలో చిక్కుకుంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా భూ కబ్జాలు సాగుతున్నాయి. సాగుకు ఉపయోగపడుతున్న చెరువులను అక్రమార్కులు చెరపడుతున్నారు. మట్టి, ఇసుక మాఫియా, రియల్టర్ల దెబ్బకు చెరువులు మాయమవుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో చెరువు కబ్జా అవుతున్నా ఇరిగేషన్ అధికారులు మీనమేషాలు లెక్కించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఆధునికతతో చేనేత పోటీ

ఆధునికతతో చేనేత పోటీ

ఆధునికతతో చేనేత పోటీ

ఆధునికతతో చేనేత పోటీ

ఆధునికతతో చేనేత పోటీ