
పకడ్బందీగా జిల్లా జట్ల ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జట్ల ఎంపిక పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో వివిధ క్రీడలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు త్వరలో తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలుగా ఎంపికయ్యే వారికి ఈనెల 29న పతకాలను ప్రదానం చేస్తారని తెలిపారు.