పాలకూట విషం | - | Sakshi
Sakshi News home page

పాలకూట విషం

Aug 8 2025 7:40 AM | Updated on Aug 8 2025 7:40 AM

పాలకూట విషం

పాలకూట విషం

● డెయిరీ ప్రాంగణంలో వదిలేస్తున్న ప్రమాదకర వ్యర్థ జలాలు ● భూగర్భంలోకి ఇంకుతుండడంతో జలకాలుష్యం ● నోటీసులిచ్చినా మారని యాజమాన్యం తీరు

తిరుపతి రూరల్‌ : గాంధీపురంలోని డెయిరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తుండడంతో సమీపంలో నివసించే జనం కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలాడుతున్నారు. ఫ్యాక్టరీకి చుట్టూ నివాసముంటున్న వారు దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు. వ్యర్థ జలాలను వదలకూడదని పలుసార్లు అధికారులు హెచ్చరికలు జారీ చేసినా.. నోటీసులు ఇచ్చినా ఆ డెయిరీ యాజమాన్యంలో మాత్రం మార్పు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాలుష్య నియంత్రమండలి అధికారులైనా స్పందించాలని స్థానికంగా నివాసముంటున్న ప్రజలు కోరుతున్నారు. తిరుపతి రూరల్‌ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న మదర్‌ డెయిరీ నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన మురుగునీరు ప్రహరీ గోడ పగిలిన ప్రాంతంలో బయటకు వస్తుండడంతో పలుసార్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఆ ప్రహరీ నుంచి వెలుపలకు వ్యర్థ జలాలు రాకుండా డెయిరీ లోపల రాళ్లు, మట్టితో నింపేసింది. కొద్దిరోజుల పాటు డెయిరీ ప్రాంగణంలో కూ డా వ్యర్థ జలాలు వదలకుండా ఉండేది. ఇటీవల వర్షాలు వచ్చినప్పటి నుంచి మళ్లీ డెయిరీ ప్రాంగణంలోనే వ్యర్థ జలాలను వదిలేస్తోంది. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు దుర్వాసన భరించలేకపోతున్నారు. మరోవైపు ఆ వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకడంతో బోర్లలో నీరు రంగు మారిపోయింది. అంతేకాక రాత్రివేళ దోమల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదర్‌ డెయిరీ నుంచి వచ్చే వ్యర్థజలాలకు అడ్డుకట్ట వేయకుంటే భూగర్భ జలాలు కలుషితమై సమీప గ్రామాల్లోని ప్రజలను అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని పలువురు పర్యావరణ పరిరక్షకులు హెచ్చరిస్తున్నారు.

కలుషితం..వ్యాధుల భయం

డెయిరీ నుంచి వెలువడే వ్యర్థనీరు భూమిలోకి ఇంకిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చు ట్టుపక్కల బోరుబావుల్లో తాగునీరు కలుషితమవుతోంది. ఆ నీటినే తాగడం, స్నానాలు చేయడంతో వ్యాధు లు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

పర్యావరణానికి పెనుముప్పు

డెయిరీ వ్యర్థ జలాలు పర్యావరణానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఇవి గాలి, భూగర్భ జలాలు, నేలను కూడా కలుషితం చేస్తాయని చెబుతున్నారు. పరిశ్రమల్లో శుభ్రపరిచే ప్రక్రియల నుంచి వచ్చే రసాయనాలు, అధిక మొత్తంలో నూనెలు, గ్రీజులను కూడా కలిగి ఉండడంతో జీవఅధోకరణం చెంది ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తాయంటున్నారు. జిల్లాస్థాయి అధికారులు దీనిపై స్పందించి డెయిరీ ప్రాంగణంలో పరిశీలించి, నిర్వాహకులపై చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నోటీసులిచ్చినా స్పందన ఏదీ..?

గతంలో బాలాజీ డెయిరీగా, ఆ తరువాత శ్రీజ డెయిరీగా, ఇప్పడు మదర్‌ డెయిరీగా పాల పదార్థాల త యారీని కొనసాగిస్తున్న డెయిరీ నుంచి వ్యర్థాలు బ యటకు వచ్చినపుడల్లా పంచాయతీ అధికారులు నో టీసులు జారీ చేస్తున్నారు. అయినా సరే ఫ్యాక్టరీ యా జమాన్యానికి చీమకుట్టినట్టు కూడా అనిపించడం లే దనే వాదనలు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నా యి. ఇటీవల మురుగునీరు బయటకు వస్తుండడంతో ఎంపీడీఓ రామచంద్ర దృష్టికి తీసుకువెళ్లగా స్థాని క పంచాయతీ కార్యదర్శి ద్వారా ఫ్యాక్టరీ నిర్వాహకులకు నోటీసు ఇచ్చారు. అలాగే కాలుష్య నియంత్ర ణ మండలి అధికారులకు సమాచారం అందించి, ఆ ఫ్యాక్టరీని పరిశీలించాలని లేఖ రాశారు. వ్యర్థ జలాల ను డెయిరీ ప్రాంగణం నుంచి బయటకు రావడం లే దు కదా అని యాజమాన్యం ధీమాగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement