
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కోసం పూజలు
సదుం: అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావాలని కోరుతూ బూరగమంద శాసనమ్మ ఆలయం, మత్తుకువారిపల్లె మల్లీశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం పూజలు చేశారు. 101 టెంకాయలను కొట్టారు. జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని కేసులతో వేధిస్తే తమకు అడ్డు ఉండదని కూటమి నేతలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులకు పెద్దిరెడ్డి కుటుంబం భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రజా సమస్యలపై మరింతగా పోరాడుతారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్పరెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గణేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చౌడేపల్లెలో..
చౌడేపల్లె: అక్రమ కేసులో కుట్రపూరితంగా రాజంపేట ఎంపీ పీవీ. మిథున్‌రెడ్డిని జైలుకు పంపారని, ఆయన విడుదల కావాలని కోరుతూ గురువారం బుటపల్లె సమీపంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, చౌడేపల్లెలోని సాయిబాబా ఆలయంలో గడ్డవారిపల్లెకు చెందిన గిరిబాబు ఆధ్వర్యంలో అభిషేక పూజలు చేసి, అన్నదానం చేశారు. ఈ వేర్వేరు కార్యక్రమాల్లో గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, చెంగారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్. దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, సింగిల్‌విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, రమేష్‌బాబు, సర్పంచ్ షంషీర్, కో–ఆప్షన్ మెంబరు సాదిక్‌బాషా, మండల పార్టీ ఉపాధ్యక్షులు వెంకటరమణ, అమర, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అనుప్రియ, నాయకులు మునికృష్ణమ నాయుడు, నారాయణరెడ్డి, గిరిబాబు, కృష్ణంరాజు, బ్రహ్మానందరెడ్డి, వినోద్‌రెడ్డి, అల్తాఫ్, సనావుల్లా, సుబ్రమణ్యం, పవన్, భాస్కర్, రెడ్డెప్పరెడ్డి, విజయ్, హరిబాబు,గంగాధర్, బాబాజాన్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కోసం పూజలు

ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కోసం పూజలు