
కుంకీ ఆపరేషన్స్ ద్వారా కట్టడి చేస్తాం
ఇటీవల టేకు మందలో కుంకీ ట్రయల్ ఆపరేషన్ సక్సెస్ అయింది. త్వరలో మదపు టేనుగుల క్యాప్చరింగ్ ప్రక్రియ చేపడతాం. ఇవి ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయనే సర్వే చేస్తున్నాం. జిల్లాలో ఏనుగుల ప్రభావం ఎక్కువగా ఉండే నడుమూరు, ఐరాల, టేకుమంద, కీలపట్ల, కల్లూరు, దామలచెరువు ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా గుర్తించాం. కుంకీల ద్వారా ఈ ప్రాంతాల్లో ఏనుగుల మళ్లింపు చేస్తాం. ఇదంతా వెంటనే జరిగేపని కాదు. అయితే ఏనుగుల సమస్యను పరిష్కరించే దిశగా చూస్తున్నాం. – భరణి, డీఎఫ్‌ఓ, చిత్తూరు
దశాబ్దాల సమస్య తీరితే చాలు..
గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే చాలు. ముఖ్యంగా మదపు టేనుగుల కారణంగానే భయమెక్కువ. వీటిని కుంకీలు అదుపు చేస్తే చాలయ్యా. అధికారులు మా పక్కన సోలార్ లైట్లను బిగించాలి. ఇప్పటికే చాలా వరకూ ఆస్తులు నష్టపోయాం. పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే అదే పదివేలు..
– పుష్పరాజ్, రైతు, ఏటిగడ్డ, పలమనేరు మండలం

కుంకీ ఆపరేషన్స్ ద్వారా కట్టడి చేస్తాం