
పల్లెల్లో మౌలిక వసతులు కల్పించండి
చిత్తూరు కార్పొరేషన్ : పల్లెలో కాలువలు, రోడ్డు , నీటి సదుపాయం వంటి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సీఈఓ రవికుమార్‌నాయుడుతో కలిసి జెడ్పీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 15వ ఆర్థిక సంఘం, జెడ్పీ సాధారణ నిధుల కింద తాగునీటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. మండలాల్లో పలు నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాట్లాడారు. తాగునీటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ కాలనీలు, లే అవుట్ల నందు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమన్వయంతో కలిసి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎంపీడీఓలు మండల స్థాయిలో పలు అభివృద్ధి పనులకు నివేదికలు తయారు చేసి జెడ్పీ సీఈఓకు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అందుకు సంబంధించిన శాఖ అధికారులు త్వరితగతిన నాణ్యమైన పనులు చేపట్టాలని కోరారు. పలు గ్రామాల్లో పనులు జరగకపోతే ఆ నివేదికను సీఈఓకు అందించాలన్నారు. నెలలోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనులలో రూ.146 కోట్ల అంచనా విలువగల 204 పనులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ద్వారా తాగునీటికి సంబంధించి రూ.93.17 కోట్ల అంచనా విలువగల 257 పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నిర్దేశిత కాలంలోపు పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్, ఎంపీడీఓలు, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.

పల్లెల్లో మౌలిక వసతులు కల్పించండి