
ఎంపీ విడుదల కోసం పూజలు
సదుం : అక్రమ కేసులో అరెస్టు అయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెంటనే విడుదల కావాలని వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పాలమంద పెద్దూరు గంగమ్మ ఆలయం, ఊటుపల్లె పంచాయతీ పుట్టావారిపల్లె మల్లికార్జున స్వామి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని ఆరోపించారు. మద్యం పాలసీతో సంబంధంలేని ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం వేధింపులలో భాగమని తెలియజేశారు. ఇలాంటి తప్పుడు కేసులకు పెద్దిరెడ్డి కుటుంబం ఎన్నడూ భయపడదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఎప్పుడూ పోరాడుతుందని వెల్లడించారు. అక్రమ కేసుల నుంచి ఎంపీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్‌లు హనుమంత రెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, ఎల్లప్ప, ఎంపీటీసీ సభ్యురాలు స్వరూప, మల్లికార్జున, నారాయణ రెడ్డి, వెంకటస్వామి, పుట్రాజు, ఎల్లారెడ్డి, గిరిధర్ రెడ్డి, శివారెడ్డి, సీతాపతి పాల్గొన్నారు.