
సాంకేతికతకు అనుగుణంగా..
సాంకేతికతకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు.
కుంకీ ఆ‘పరేషాన్’
కుంకీలతో మదపుటేనుగులను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన కుంకీ ఆపరేషన్ కొనసాగుతోంది.
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నగరి : చేనేతను పరిష్కారం కాని డిమాండ్లు వేధిస్తూనే ఉన్నాయి. వ్యవసాయం తరువాత అధిక జనాభా ఉపాధి పొందుతున్న రంగమైన చేనేత నిలదొక్కుకోవాలంటే కావాల్సిన సాయం బారెడు ఉంటే ప్రభుత్వం 200 ఉచిత యూనిట్ల రూపంలో అందించే సాయం బెత్తెడు మాత్రమే. ఉమ్మడి జిల్లాలో చేనేతపై ఆధారపడి సుమారు 5 వేల కార్మికులు ఉండగా 15 వేల మంది ఈ వృత్తిపై పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తూ చేనేత కార్మికులను ఆదుకుంది. ఇలా చిత్తూరు జిల్లాలో 194 మంది చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందగా తిరుపతి జిల్లాలో 4,144 మంది ఈ పథకంలో ప్రయోజనం పొందారు. ప్రభుత్వం మారడంతో నేతన్న నేస్తం అటకెక్కింది. ఏడాది కాలంగా వారికి ఎలాంటి సాయం అందలేదు.
చేనేత కార్మికుల సంఖ్య తగ్గింపు
గతంలో చిత్తూరు జిల్లాలో 194 మందికి, తిరుపతి జిల్లాలో 4144 మందికి నేతన్న నేస్తం అందించేవారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4338 మందికి నేతన్న నేస్తం పథకంలో ఏడాదికి 10.41 అయితే నేడు ఉచిత విద్యుత్‌కు చేనేత, జవుళి శాఖ ఏడీ నుంచి ఉచిత విద్యుత్‌కు వచ్చిన జాబితాలో 1663 మందిని మాత్రమే అర్హులుగా నిర్ణయించారని చేనేత సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాలుగు వేల మందికిపైగా నేతన్న నేస్తం గుర్తించినా ఇంకా ఎంతో మంది ఉన్నారని వారందరికీ నేతన్న నేస్తం ఇవ్వలేదని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు నేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయినా నోరు మెదపడం లేదని అంటున్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకు రావడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అది పూర్తి స్థాయిలో అందరికీ అందించాలని కోరుతున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా మరోమారు వారు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.
మాంగాడులో చేనేత మగ్గం నడుపుతున్న
చేనేత కార్మికుడు
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
చేనేతకు దక్కని చేయూత
ప్రభుత్వం ఇచ్చేది మూరెడు.. తీసేసింది బారెడు
రూ.24 వేల నేతన్న నేస్తం కనుమరుగు
200 యూనిట్ల ఉచిత విద్యుత్ కంటితుడిపే
ఉచితం అంటూనే మోసం
నేడు జాతీయ చేనేత దినోత్సవం
చేనేత రంగానికి చేయూత అందించే దిశగా గత ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు అందించేవారు.. కానీ కూటమి ప్రభుత్వం నేతన నేస్తం లేకుండా కేవలం 200 యూనిట్లకు ఉచిత విద్యుత్‌తోనే సరిపెడుతోంది. 200 యూనిట్లకు లెక్కగడితే వీటి మొత్తం రూ.12 వేలే అవుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చే రూ.24 వేలకు బదులు నేడు రూ.12 వేలతోనే కంటి తుడుపుగా ఉచిత విద్యుత్ అంటూ నేతన్నలను కూటమి ప్రభుత్వం మరోసారి దగా చేస్తోంది.
చేనేత కార్మికులు ప్రతిపాదిస్తున్న డిమాండ్లు ఇవీ
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అమలు చేయాలి.
మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తింపజేయాలి.
చేనేత వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తి వేయాలి.
కాటన్, సిల్క్ జరీలపై 50 శాతం రాయితీ ఇవ్వాలి.
చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పింఛన్ మంజూరు చేయాలి.
చేనేత అనుబంధ వృత్తుల వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి.
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, సంఘాలను బలోపేతం చేయాలి.
త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి.
ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు రూ.7 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
ముద్రా స్కీము కింద రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.
చేనేత కార్మికులకు గృహం, వర్క్‌షెడ్ పథకం అమలు చేయాలి. ఇల్లు లేని చేనేతలకు మూడు సెంట్ల స్థలంతో ఇంటి స్థలాలను కేటాయించాలి. వర్క్ షెడ్డు కోసం అందనంగా రూ. 50 వేలు అందించాలి.
ఎల్‌ఐసీ ద్వారా మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన పథకం పునరుద్ధరించాలి.
మాస్టర్ వీవర్లు, చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రభుత్వం మార్కెట్ వసతులు కల్పించాలి.
చేనేత రిజర్వేషన్ చట్టాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలి.
చేనేత కార్మికులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి.
చేనేత గ్రామాల్లో చేనేత క్లస్టర్లు అమలు చేయాలి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చేనేతలు పొందిన లబ్ధి వివరాలు
లబ్ధి పొందిన నేత కార్మికులు : 4338
నేతన్న నేస్తం : రూ.10.41 కోట్లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వంలో చేనేతలు పొందిన లబ్ధి వివరాలు
200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు
అర్హత పొందినవారు : 1663
ఏడాదికి లబ్ధి సుమారుగా : రూ.1.99 కోట్లు
చేనేతపై ఆధారపడిన వారిని అర్హులుగా గుర్తించాలి
చేనేత రంగం ఒడుదొడుకుల మధ్యే ముందుకుపోతోంది. బలోపేతం చెయ్యాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం 200 యూనిట్లు ప్రభుత్వం ఉచితంగా అందించడం హర్షణీయం. అయితే చేనేతపై ఆధారపడిన అందరినీ అర్హులుగా గుర్తించాలి. వీటితో పాటు గతంలో ఇచ్చిన విధంగా నేతన్న నేస్తం అందించాలి. ప్రభుత్వానికి చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయించాలి. చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేసి, ఉపాధికి ఆర్ధికంగా తోడ్పాటు అందించాలి. నూలు, సిల్క్, జరీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలి. రాష్ట్ర చేనేత అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలి.
– ఆకుల వాసు, రాష్ట్ర చేనేత కార్మికుల యూనియన్ అధ్యక్షుడు
ఏడాదికి లాభం రూ.12 వేలే
ఒడుదొడుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ వచ్చిన చేనేత రంగానికి ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే సహకారం అంతంత మాత్రమే. నెలకు 200 యూనిట్లకు గరిష్టంగా లెక్కించినా సుమారు రూ.800 నుంచి రూ.1000 అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి వారికి కలిగే లాభం రూ.12 వేల వరకు మాత్రమే ఉంటుంది. ఇందులోనూ ఇప్పటికే విద్యుత్ బిల్లులు ఎడాపెడా పెంచేశారు. అభ్యంతరకరమైన స్మార్ట్ మీటర్లను బిగిస్తూ వస్తున్నారు. దీంతో ఉచిత విద్యుత్ ద్వారా చేనేతకు కలిగే లబ్ధి అంతంత మాత్రమే ఉంటుంది. గతంలో ఇచ్చిన విధంగా నేతన్న నేస్తం క్రమం తప్పకుండా అందిస్తే ఏటా రూ.24 వేలు వచ్చేది. వాటితో నేతన్నలు ఫెడల్ లూమ్స్, నూతన డిజైన్లు ఇచ్చే జక్కార్డ్‌లు, బాబిన్లు కొనుగోలు చేసుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక ఏడాది నేతన్న నేస్తము, ఉచిత విద్యుత్ లేకనే గడిచిపోయింది.

సాంకేతికతకు అనుగుణంగా..

సాంకేతికతకు అనుగుణంగా..