
అమ్మ పాలే బిడ్డకు అమృతం
జిల్లాలో తల్లిపాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. తల్లిపాలే బిడ్డకు అమృతమని ఉద్ఘాటిస్తున్నారు.
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు ఉచితం మాటున ఇసుకను అడ్డంగా దోచేస్తున్నారు. అధికారికంగా చిత్తూరు మండలంలోని పాలూరు వద్ద ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ పక్కనే అనధికారికంగా మరో డంప్ ఏర్పాటు చేశారు. పగలంతా ఆ డంప్‌లో ఇసుక లోడ్ చేసి రాత్రి పూట తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ దందా సాగుతున్నా ఎవ్వరూ అటువైపు కన్నెత్తి
చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పాలూరు అనధికారిక ఇసుక డంప్
అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తూరు మండలంలో అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. వాగులు, వంకలు.. ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. మండలంలోని ఆనగల్లు, బీఎన్‌ఆర్‌పేట రీచ్ కేంద్రంగా అక్రమ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ప్రభుత్వం ఉచితమనే సరికి..ఇదే అదునుగా ఇసుకను యంత్రాలతో అడ్డదిడ్డంగా లోడేస్తున్నారు. ఆపై లారీలు, టిప్పర్లతో యథేచ్ఛగా చైన్నెకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధికారిక డంప్ పేరుతో...
ఇసుకను జిల్లా వ్యాప్తంగా అందజేయాలని కూటమి ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి బాధ్యతలను అప్పగించింది. ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ ఫాయింట్‌కు తరలించేలా ఒప్పందం కుదుర్చుకుంది. చిత్తూరు మండలంలోని అనంతాపురం గ్రామం వద్ద స్టాక్ పాయింట్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. అయితే ఆ స్టాక్ పాయింట్‌ను లోకల్‌గా కిల్ చేస్తున్నారు. కూటమి నేతలు కొందరు ఇసుకాసురులుగా అవతారమెత్తి...ఇసుక యథేచ్ఛగా తరలించేస్తున్నారు. కేటాయించిన ప్రాంతం వదిలి పాలూరు ప్రాంతంలో ఇసుక డంప్‌ను ఏర్పాటు చేయించారు. ఈ డంప్ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణాకు కూటమి నేతలు పదును పెట్టారు.
అనధికారిక డంప్... ఇసుక జంప్
పాలూరు వద్ద ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్‌లో అధికారికంగా ఇసుక డంప్ అవుతోంది. ఈ డంప్ పక్కనే కూటమి నేతలు అనధికారికంగా మరో డంప్ ఏర్పాటు చేసుకున్నారు. పగలంతా డమ్మీ డంప్‌లో టన్నుల కొద్దీ ఇసుకను నిల్వ చేసుకుని రాత్రి పూట అక్రమ వ్యాపారం నడిపిస్తున్నారు. రోజుకు 10 నుంచి 15 లారీల ఇసుకను డంప్ చేసుకుని తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. యంత్రాలతో లారీలకు లోడ్ చేసి పైన ప్లాస్టిక్ పట్ట కట్టేస్తున్నారు. అక్కడి నుంచి బీఎన్‌ఆర్‌పేట చెక్‌పోస్టు, కుర్చివేడు మార్గం మీదుగా తమిళనాడుకు తరలించేస్తున్నారు. అలాగే తాళంబేడు మీదుగా గుడిపాల మండలంలోని చీలాపల్లి వయా తమిళనాడుకు ఇసుక తరలిస్తున్నారు. ఇలా అధికారిక డంప్‌ను చూపించి.. అనధికార డంప్ నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలించి కోట్లకు పడగెత్తుతున్నారు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
చిత్తూరు మండలంలో జోరుగా ఇసుక దోపిడీ పాలూరులో పాతుకుపోయిన ఇసుకాసురులు అధికారిక డంప్ పేరు చెప్పి అనధికారిక డంప్ తమిళనాడుకు యథేచ్ఛగా తరలింపు కూటమి నేతల కన్నుసన్నల్లో చెలరేగుతున్న మాఫియా పట్టించుకోని మైనింగ్ శాఖ
నిఘా ఏమైంది?
ప్రైవేటు కంపెనీ ఇచ్చిన స్టాక్ పాయింట్ ఏర్పాటుకు నిఘా నేత్రం ఉండాలి. కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అవేమీ ఇక్కడ కనిపించడం లేదు. మైనింగ్ శాఖ అధికారులు ఈ డంప్‌ను నిత్యం పర్యవేక్షించాలి. కానీ అవేవీ ఇక్కడ అమలు కావడం లేదు. దీంతో అక్రమార్కులు ఇసుకను దొడ్డి దారిన అమ్మేస్తున్నారు. కూటమి నేతలు ఏర్పరుచుకున్న ఓ గ్యాంగ్‌ను ఆ డంప్‌కు కాపలా పెట్టి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అటు వైపు ఎవరైనా తొంగి చూస్తే వారి వారి భరతం పడుతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ ఇసుక డంప్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు మేల్కొని అక్రమ ఇసుక వ్యాపారానికి కళ్లెం వేయాలని స్థానికులు కోరుతున్నారు.
పాలూరు కేంద్రంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూటమిలోని ఓ వర్గం సిద్ధమైంది. అడ్డూఅదుపు లేకుండా ఎలా రవాణా చేస్తారంటూ మండిపోతోంది. బీఎన్‌ఆర్‌పేట చెరువంతా ఊడ్చేస్తున్నారని ఆగ్రహానికి గురవుతోంది. అదే తాము రవాణా చేసేటప్పుడు మాత్రం వారు ఎలా అడ్డుకున్నారో చూశామని పేర్కొంటోంది. ఇప్పుడు మాత్రం వాళ్లు ఎలా చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. త్వరలో ఈ అక్రమ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆ వర్గం పేర్కొంటోంది.
ఇప్పుడేమీ ఇసుక వెళ్లడం లేదే!
కేవలం ఇసుక డంప్ మాత్రమే చేస్తున్నాం. ఇంతవరకు అమ్మకాలు ఏమీ జరగడం లేదు. త్వరలో ప్రారంభిస్తాం. అక్రమంగా ఇసుక వెళ్తుంటే చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాలు కూడా పెడతాం. రెండు రోజుల్లో పరిశీలిస్తాం. నిబంధనలు పాటించేలా చూస్తాం.
–సత్యనారాయణ, ఏడీ, మైనింగ్‌శాఖ, చిత్తూరు

అమ్మ పాలే బిడ్డకు అమృతం

అమ్మ పాలే బిడ్డకు అమృతం

అమ్మ పాలే బిడ్డకు అమృతం