
పెద్దిరెడ్డి కుటుంబంపై కూటమి కుట్ర
బంగారుపాళెం: పెద్దిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందని వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ఆరోపించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ సోమవారం మండలంలోని మొగి లి వెంకటగిరిలో వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకోదండరామాలయం, ఆంజనేయస్వామి ఆలయా ల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఆలయం ముందు కొబ్బరి కాయలు కొట్టారు. ఆయన మాట్లాడుతూ ఎంపీకి సంబంధం లేని కేసులో ఇరికించి చంద్రబాబు ప్రభుత్వం ఆనందం పొందుతోందని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సోషియల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అమరనాథ్, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిదస్వామి, రఘుపతిరాజు, కో–ఆప్షన్ సభ్యుడు ఫిరోజ్, మండల మైనారిటీ, ఎస్సీసెల్ అధ్యక్షులు షాకీర్, నాగరాజ, మండల మహిళా అధ్యక్షురాలు వాణిప్రియ, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, రైతు విభాగం నాయకులు పాలాక్షిరెడ్డి, అరుణామల్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగంతోనే అక్రమ కేసులు
పూతలపట్టు సమన్వయకర్త
డాక్టర్ సునీల్‌కుమార్ ధ్వజం
ఎంపీ మిఽథున్‌రెడ్డికి బెయిల్‌రావాలని పూజలు

పెద్దిరెడ్డి కుటుంబంపై కూటమి కుట్ర