
నిర్బంధ
అసమర్థ పాలనకు నిదర్శనం
హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.
వైఎస్సార్‌సీపీలో టీడీపీ నేతల చేరిక
సిరివెన్నెల గీతాలు చిరస్మరణీయం
బోయకొండ కిటకిట
బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. క్యూలైన్లు అన్నీ రద్దీగా మారిపోయాయి.
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమం దారి తప్పింది. క్షేత్రస్థాయిలో ఆదరణ లేక ఉద్యోగులపై ఒత్తిడి తెస్తోంది. సంపన్నులు పేద కుటుంబాలను దత్తత తీసుకుని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దేలా పీ–4 కార్యక్రమాన్ని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో ఎవరూ ముందుకు రాకపోవడంతో కార్యక్రమం అబాసుపాలవుతోంది. కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలకు ఉద్యోగులను బలి చేస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. చిరు జీతాలపై ఆధారపడే ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అనే పేరుతో నామకరణ చేశారు. దత్తత తీసుకునే వారిని మార్గదర్శకులని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ–4 కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. ఆగస్టు 15వ తేదీకల్లా జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఈ టార్గెట్‌పై జిల్లా యంత్రాంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.
ప్రభుత్వం చెప్పిన దత్తత ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రాని దుస్థితి. దీంతో కూటమి ప్రభుత్వం ఉద్యోగులను టార్గెట్ చేసింది. పలు చోట్ల ఉద్యోగులనే మార్గదర్శకులుగా నమోదు చేస్తున్న పరిస్థితులున్నాయి. జిల్లాలో మొత్తం 65,451 బంగారు కుటుంబాలను సర్వేలో గుర్తించారు. ఈనెల 1వ తేదీన అధికారిక నివేదికల ప్రకారం జిల్లాలో 33,386 కుటుంబాలను 2583 మంది దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఇంకా జిల్లాలో 32,030 కుటుంబాలకు కూటమి ప్రభుత్వం మార్గదర్శకులను ఏర్పాటు చేయాల్సి ఉంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, ఇతర శాఖల ఉద్యోగులను టార్గెట్ చేశారు. సచివాలయ ఉద్యోగులు మూడు నుంచి ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల జీతం రూ.30 వేలలోపే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జీతంతోనే వారి కుటుంబం గడవాల్సిన పరిస్థితి. అలాంటి చిరుద్యోగులైన సచివాలయ ఉద్యోగులు పేదలైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటే ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయుల్లోనూ ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న మేరకు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శకులు ఆ కుటుంబం ఉండడానికి ఇల్లు, బతకడానికి ఉపాధి, కుటుంబంలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, ఆరోగ్య పరంగా ఇబ్బందులుంటే ఆదుకోవడం వంటి అనేక లక్ష్యాలను చేయాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులకు ఈ లక్ష్యం విధిస్తే ఏ విధంగా నెరవేరుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో టీచర్లపై ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఉపాధ్యాయ సంఘం నేతలు భగ్గుమంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోనే మార్గదర్శకులకు దిక్కు లేని పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పీ–4 కార్యక్రమం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సీఎం ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో మొత్తం బంగారు కుటుంబాలు 10,407ను గుర్తించారు. ఆ కుటుంబాల్లో 34,441 మంది కుటుంబ సభ్యులున్నారు. ఈనెల 1వ తేదీ నాటికి కుప్పం నియోజకవర్గంలో 3,068 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇంకా 7,339 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో 657 మంది మార్గదర్శకులను మాత్రం నమోదు చేశారు. ఈ కార్యక్రమం వల్ల పేదలకు ఒరిగేదేమి ఉండదని, కేవలం కూటమి ప్రభుత్వం ఆర్భాటం కోసమేనని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పీ–4 కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆర్భాట ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లి గ్రామంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆ వివరాలేవీ ఆన్‌లైన్‌లో కనిపించని పరిస్థితి. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో షాడో ప్రజాప్రతినిధి ఇంత వరకు ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకున్నారో తెలియని పరిస్థితి. అదే విధంగా చిత్తూరు, పూతలపట్టు, నగరి, గంగాధరనెల్లూరు, పలమనేరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎంత మందిని దత్తత తీసుకున్నారో ప్రజలెవ్వరికీ తెలియని దుస్థితి. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన పీ–4 కార్యక్రమంపై సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ముఖం చాటేస్తున్న పరిస్థితులున్నాయి. కూటమి పార్టీలోని జనసేన, బీజేపీ అయితే పీ–4పై అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 4వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.
6న విద్యుత్ గ్రీవెన్స్
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 6న బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక గాంధీరోడ్డులోని ట్రాన్స్‌కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వివరించారు.
5 నుంచి జిల్లా స్థాయి
క్రీడా పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడా పోటీలను శాప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్.శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీయూ క్రీడా మైదానం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాకీ గ్రౌండ్, పాత ఏజీఎస్ కళాశాల మైదానాల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ క్రీడల్లో సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులు, జట్లకు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జోనల్ స్థాయిలో, అక్కడ ప్రతిభ చూపిన జట్లు, క్రీడాకారులకు 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా జిల్లాకు చెందిన వారై ఉండాలని, అలాగే 22 ఏళ్లలోపు వయస్సున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 90596 06346, 99484 44759 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
చౌడేపల్లె : తెలుగుదేశం పార్టీని విడిచి వైఎస్సార్‌సీపీలోకి శెట్టిపేట పంచాయతీ తోటకురప్పల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నేత (ప్రస్తుత రేషన్ షాపు డీలర్) కుమార్‌రాజు, ఆమినిగుంట పంచాయతీ సింగిరిగుంటకు చెందిన రమేష్‌నాయుడు, హరి ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మాజీ బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ సమక్షంలో చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ కండువాను వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ..కూటమి పాలన నచ్చకనే తెలుగుదేశం పార్టీని విడిచి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పేర్కొన్నారు.
ఆదివారం మండలంలోని పందిళ్లపల్లె, ఆమినిగుంట గ్రామ పంచాయతీల్లో జరిగిన బాబూ షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచులు ఓబుల్‌రెడ్డి, షంషీర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్రమణ్యం, నాయకులు సుబ్రమణ్యం రాజు, హనుమంతురెడ్డి, సాధిక్, శంకర్‌రెడ్డి, శంకరప్ప, గంగాధర్, అనుప్రియ, హరి పాల్గొన్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
పీ–4లో దత్తత తీసుకునేందుకు ముందుకు రాని ఆశావహులు ఉద్యోగులనే మార్గదర్శకులుగా చేరుస్తున్న అధికారులు ముఖం చాటేస్తున్న కూటమి ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులకు 3 నుంచి 5 కుటుంబాలు దత్తత రూ.30 వేలలోపు జీతమున్న ఉద్యోగికి దత్తత సాధ్యమేనా? టీచర్లు, ఇతర ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం
సీఎం సొంత నియోజకవర్గం
కుప్పంలో పీ–4 దుస్థితి ఇలా..
మండలం బంగారు దత్తత తీసు
కుటుంబాలు కోవాల్సినవి
గుడుపల్లి 1,725 1,467
కుప్పం రూరల్ 2,289 1,799
కుప్పం అర్బన్ 1,371 340
రామకుప్పం 2,361 2,194
శాంతిపురం 2,661 1,536
మొత్తం 10,407 7,336
పీ–4 కార్యక్రమంలో జిల్లా పురోగతి ఇలా..
నియోజకవర్గం బంగారు దత్తత
కుటుంబాలు తీసుకోవాల్సివి
చిత్తూరు 7,953 7,347
గంగాధరనెల్లూరు 11,573 4,473
కుప్పం 10,407 7,336
నగరి 5,135 223
పలమనేరు 10,106 3,514
పుంగనూరు 9,541 1,312
పూతలపట్టు 10,736 7,825
మొత్తం 65,451 32,030
పూర్తి బకాయిలు చెల్లించండి..
దత్తత పరిశీలిస్తాం
టీచర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లిస్తే పీ–4 కార్యక్రమంలో దత్తత అంశం పరిశీలన చేస్తాం. కూటమి ప్రభుత్వం టీచర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఏడాది పూర్తి అవుతున్నా ఇంత వరకు చెల్లించని దుస్థితి. మధ్య తరగతి శ్రేణిలో ఉండే టీచర్లకు కొన్ని కుటుంబాలను బంగారు కుటుంబాల పేరుతో దత్తత తీసుకోమనడం దారుణం. దత్తత తీసుకునే అంశం ఐచ్ఛికంగా ఉండాలి తప్ప ఒత్తిడి చేయడం సరికాదు. – రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీచర్స్
అసోషియేషన్ రాష్ట్ర ట్రెజరర్
ఒత్తిడి చేయడం సరికాదు
టీచర్లందరూ ఇప్పటికే బోధనేతర కార్యక్రమాలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం పీ–4 అనే కార్యక్రమం పెట్టకపోయినా తమ వంతు బాధ్యతగా పేద విద్యార్థులకు సహాయ సహకారం అందిస్తున్నాం. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం పీ–4 కార్యక్రమం పేరుతో దత్తత తీసుకోవాలని నిర్భంధం చేయడం సరైన పద్ధతి కాదు.
– జీవీ.రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.
ఎవరూ ఆసక్తి చూపకపోవడం
ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యేలు
సీఎం నియోజకవర్గానికే దిక్కు లేదు..
టీచర్లపై తీవ్ర ఒత్తిళ్లు

నిర్బంధ

నిర్బంధ

నిర్బంధ

నిర్బంధ

నిర్బంధ