చిరుద్యోగుల కడుపుకొట్టిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

చిరుద్యోగుల కడుపుకొట్టిన కూటమి ప్రభుత్వం

Aug 4 2025 3:22 AM | Updated on Aug 4 2025 3:22 AM

చిరుద్యోగుల కడుపుకొట్టిన కూటమి ప్రభుత్వం

చిరుద్యోగుల కడుపుకొట్టిన కూటమి ప్రభుత్వం

చౌడేపల్లె: మోసపూరిత హామీలతో అఽధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇ చ్చిన హామీలను అమలుచేయకపోగా చి రుద్యోగులను తొలగించి వారి కడుపుకొట్టారని వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు జి.నాగభూషణరెడ్డి, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణ మ్మ ఆరోపించారు. వారు ఆదివారం పందిళ్లపల్లె, ఆమినిగుంట, పరికిదొనలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులందరికీ పథకాలు అందించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదో ఒక సాకుచూపి అర్హత ఉన్నా పథకా ల్లో కోత విధిస్తోందని తెలిపారు. అందరికీ అన్ని ఇస్తున్నట్టు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. వలంటీర్లకు రూ:10 వేలు ఇస్తామని ఆశ పెట్టి ఉద్యోగాలే లేకుండా చేసినట్టు ఆరోపించారు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రేషన్‌ షాపు డీలర్లు, సంఘ మిత్రలు తదితరులను అక్రమంగా తొలగించి వారి కుటుంబాలను రోడ్డన పడేశారని దుయ్యబట్టారు. కూటమి నేతల దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించారు.

ఏకష్టమొచ్చినా పెద్దిరెడ్డి కుటుంబం

అండగా ఉంటుంది

పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అండగా ఉంటుందని వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచులు షంషీర్‌ ఓబుల్‌రెడ్డి, మల్లీశ్వరి, లక్ష్మిదేవి, మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, కోఆప్షన్‌ మెంబరు సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement