
ఎంపీ విడుదల కావాలంటూ ప్రార్థనలు
పుంగనూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంపై ముస్లింలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదివారం ముస్లిం మైనార్టీ నాయకులు అస్లాంమురాధి, నయాజ్, అజ్మత్, అర్మన్, నవాజ్‌ఖాన్, వసీమ్ కలిసి నూర్‌షావలీ పెద్ద దర్గాలో ప్రార్థనలు చేశారు. అల్లా దయతో మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని, కూటమి నేతలకు కళ్లు తెరిపించాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అస్లాం మురాధి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ వారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు దోరణితో కేసులు పెట్టి, జైల్లో పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
ఆరిమాకులపల్లిలో పూజలు
శ్రీరంగరాజపురం : మండలంలోని తయ్యూరు పాయికట్టు ఆరిమాకులపల్లిలో వెలసిన ఆరిమాని గంగమ్మ ఆలయంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలప్ప, నియోజకవర్గం సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మణి, వలంటీర్ విభాగం అధ్యక్షుడు అశోక్, మేథావుల విభాగం అధ్యక్షుడు దామునాయుడు పాల్గొన్నారు.