
ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు
అదనపు పోలింగ్ కేంద్రాలు..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌వో తెలిపారు.
ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలతో పార్టీకి నష్టం
సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ దాడుల నేపథ్యంలో బ్యాంకర్లు అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఫ్యాఫ్టో సంఘ నాయకులు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఫ్యాఫ్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరోత్తమరెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో డిమాండ్ల పరిష్కారానికి గెజిటెడ్ హోదా కలిగిన ఎంఈవోలు సైతం పాల్గొన్నారు. నరోత్తమరెడ్డి మాట్లాడుతూ.. టీచర్లకు పాఠాలు చెప్పేందుకు అవకాశం కల్పించాలన్నారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ‘పిల్లలు బడికి వచ్చేది చదువు నేర్చుకోవడానికి.. టీచర్లు చదువు నేర్పేవారు’ ఇది ఒకప్పటి సంగతి... నేడు ‘పిల్లలు బడికి వచ్చేది, మధ్యాహ్న భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కి, రాగి జావ కోసం మాత్రమే అన్నట్టు... టీచర్లు ఇవి పిల్లలకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారు’ అనే విధంగా ఉందని విమర్శించారు. అదే విధంగా టీచర్లను ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను అమలు చేసే విధంగా వాడుకుంటూ మిగిలిన సమయంలో పాఠాలు చెప్పే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి ధోరణి పేద విద్యార్థుల అభివృద్ధికి ఎంతో ప్రమాదకరమన్నారు. టీచర్లను బోధనేతర పనులకు దూరం పెట్టి పాఠాలు బోధించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
హామీల అమలులో అలసత్వం సరికాదు
కూటమి ప్రభుత్వం టీచర్లు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం వహించడం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. కరోన సమయంలో మృతి చెందిన స్థానిక సంస్థల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబీకులకు ఇప్పటికీ కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం దారుణమన్నారు. స్థానిక సంస్థల్లో ఖాళీలు లేవనే సాకు చూపించి కాలయాపన చేయడం అన్యాయమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వన్ టైం సెటిల్‌మెంట్ రూపంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారుల బదిలీలు వెంటనే చేపట్టాలన్నారు.
ఈహెచ్‌ఎస్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈహెచ్‌ఎస్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. మున్సిపల్ టీచర్ల జీపీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అంతర జిల్లాల బదిలీలు చేపట్టాలి
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ.. అంతర్ జిల్లా బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. సూపర్ న్యూమరి పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండింట్‌లు, పీఈటీలకు ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమంను సమాంతరంగా అమలు చేయాలన్నారు.
పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీ నియామకం
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఎ. కిషోర్‌కుమార్‌రెడ్డి (పూతలపట్టు), పి.సందీప్‌రెడ్డి(సత్యవేడు), ఎం.మధుసూదన్‌రెడ్డి(పుంగునూరు), టి.మల్లికార్జునగౌడ్(శ్రీకాళహస్తి), క్రిస్టియన్, మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆర్.నందకుమార్(చిత్తూరు), చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఇ.అయప్పన్(నగిరి)కి చెందిన వారు నియమితులయ్యారు.
ఈవీఎం గోదాంలపై నిఘా
చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట భద్రత ఉండాలని డీఆర్‌వో మోహన్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. 24 గంటల పాటు నిఘా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించాలన్నారు. హమాలీల సహాయంతో గోడౌన్‌లోని సామగ్రిని పటిష్టంగా భద్రపరచాలని తెలిపారు. కార్యక్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్, అట్లూరి శ్రీనివాసులు, సురేంద్ర కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం
చిత్తూరు అర్బన్ : ప్రముఖ నాటక రచయిత, నటుడు, సంఘ సేవకులు బళ్లారి రాఘవ నాటక రంగానికి విశేషంగా కృషి చేశారని ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శనివారం బల్లారి రాఘవ 145వ జయంతిని జరుపుకున్నారు. ఎస్పీతో పాటు పోలీసు అధికారులు బళ్లారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ బళ్లారి నాటక రంగానికి, సమాజాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహబూబ్ బాష, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
– డీఐఈవోగా బాధ్యతలు స్వీకరించిన రఘుపతి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు నూతన ఇంటర్మీడియట్ డీఐఈవో రఘుపతి అన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆయనకు చిత్తూరు డీఐఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతనంగా నియమితులైన ఆయన శనివారం పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది కంటే ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల పెంపునకు చర్యలు చేపడుతామన్నారు. రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లాను అగ్రగామిగా ఉంచేందుకు తమ వంతు చర్యలు చేపడుతామన్నారు.
ప్రైవేట్ కళాశాలలు నిబంధనలు పాటించాల్సిందే
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు కచ్చితంగా బోర్డు నిబంధనలను పాటించాల్సిందేనని నూతన డీఐఈవో రఘుపతి హెచ్చరించారు. నిబంధనలను అమలు చేయని కళాశాలలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నిబంధనలను అమలు చేయకుండా విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. నూతన డీఐఈవోను చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ దయానందరాజు, సయ్యద్ మౌలా, హేమలత, శరత్‌చంద్ర, తదితరులు సత్కరించారు. అనంతరం పలువురు ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్స్ డీఐఈవోను కలిశారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు రవికుమార్, నాన్ టీచింగ్ అసోషియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అక్రమాలతో పార్టీ పరువు పోతోందని టీడీపీ నాయకులు రామానుజం చలపతి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. నగరిలో విచ్ఛలవిడిగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి, రేషన్, ఎర్ర చందనం, ఇసుక దందాలు చేసే వ్యక్తులకే పిలిచి టీడీపీలో పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ద్వారానే ఈ దందా జరుగుతోందన్నారు. అయినా జిల్లాలోని పార్టీ పెద్దలంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత వరకు ఎమ్మెల్యే పసుపు చొక్కా తొడగలేదన్నారు. బీసీలను పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. సుపరిపాలన కరపత్రాలు కూడా పార్టీ శ్రేణులకు చేరని పరిస్థితి ఉందన్నారు. కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలు టీ, కాఫీలకు మాత్రమే కలుస్తున్నారన్నారు. ప్రజల్లోకి రావడానికి మాత్రం ప్రొటోకాల్ అడ్డం వస్తోందన్నారు. ఎంపీ నగరి నియోజకవర్గంలోని రాకూడదని ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు తెలిసిందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, పార్టీ నమ్ముకుని తాము జీవించడం లేదన్నారు. కాగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లత తదితరులు పాల్గొన్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
కలెక్టరేట్ ఎదుట ఫ్యాఫ్టో సంఘ నేతల ఆందోళన
బోధనేతర పనులకు దూరం పెట్టాలని డిమాండ్
పెండింగ్ బకాయిలు చెల్లించాలని నిరసన
ధర్నాలో పాల్గొన్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు
నగరి ఎమెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
టీడీపీ నాయకుడు రామానుజం చలపతి ధ్వజం
ఏకపక్షంగా నిర్ణయాలు
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ప్రకారం అమలు చేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వ యాజమాన్యాలకే అమలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి దూరం పెట్టాలని ఆందోళన చేపట్టారు. పాఠాలు బోధించకుండా అనవసర పనులను పెట్టి పేద పిల్లలను చదువులకు దూరం చేయొద్దని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ధర్నాకు దిగింది. బదిలీలు ముగిసి 45 రోజులు అవుతున్నా ఇంకా వేతనాలు విడుదల చేయకపోవడంపై టీచర్లు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
సీపీఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్‌ను అమ లు చేయాలని కోరారు. ఉద్యోగులకు, టీచర్లకు పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను, 11 వ పీఆర్‌సీ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన హామీలను, డిమాండ్‌లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని ఫ్యాఫ్టో నాయకులు హెచ్చరించారు. అనంతరం డీఆర్‌వో మోహన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఫ్యాఫ్టో సెక్రెటరీ మునీర్ అహ్మద్, కో చైర్మన్లు అరున్‌కుమార్, రామమూర్తి, నాయకులు ధక్షిణామూర్తి, సోమశేఖర్‌నాయుడు, కిరణ్, సురేష్, పలు ప్రాంతాల టీచర్లు పాల్గొన్నారు.
బదిలీలు ముగిసినా జీతాలేవీ?
చైర్మన్ మణిగండన్ మాట్లాడుతూ.. బదిలీలు జరిగి 45 రోజులు ముగిసినప్పటికీ ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అవసరమైన టీచర్లు లేక పేద విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో 72,73,74 జీవోలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా గాలికొదిలేయడం దారుణమన్నారు. 11వ పీఆర్‌సీ గడువు ముగిసి 2 ఏళ్లు పూర్తి అయినా 12 వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి చర్యలు