
6 నుంచి వేణుగోపాలస్వామి తెప్పోత్సవాలు
కార్వేటినగరం : ఈనెల 6 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో పట్టణంలోని వేణుగోపాలస్వామి తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి సురేష్‌కుమార్ తెలిపారు. శనివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ అధికారి మాట్లాడుతూ.. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమాలు ఇలా..
● 6వ తేదీ బుధవారం కోదండరామ స్వామివారికి స్నపన తిరుమంజనం, రాత్రి 6.30 గంటల నుంచి 8 గంటల వరకు స్కంధ పుష్కరిణిలో సీతా, లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారు తెప్పపై విహారం
● 7వ తేదీ గురువారం రాత్రి 6.30 నుంచి 8 గంటలకు తెప్పోత్సవం ఉంటుందని, ఉభయ దేవేరులతో స్వామి విహారం.
● 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తెప్పోత్సవాల్లో ఆఖరి రోజు స్వామివారు 9 చుట్లు విహారం.