
ఎంపీకి బెయిల్ రావాలంటూ అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు
చౌడేపల్లె : అక్రమ కేసులో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపారని త్వరగా బెయిల్ ఇవ్వడంతో పాటు అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా మిఽథున్‌రెడ్డి బయటకు రావాలని అజ్మీర్ షరీఫ్ దర్గాలో చౌడేపల్లె మైనార్టీ నేత సద్దాం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం దర్గాలో బాబా మజ్జార్‌కు చాదర్‌ను కప్పి మతపెద్దల చేత దువ్వా చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకొనేలా కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.