‘‘పేద బిడ్డల ఉన్నత చదువులకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది.. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తోంది.. త్రైమాసికం వారీగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది’’ అని ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యాదీవెన జిల్లాస్థాయి కార్యక్రమంలో ఆయన
పాల్గొన్నారు. మహోన్నత ఆశయంతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న విశిష్ట పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమంగా రాణించాలని పిలుపునిచ్చారు.