పేదల గుండెల్లో ‘గూడు’.. | Sakshi
Sakshi News home page

పేదల గుండెల్లో ‘గూడు’..

Published Mon, Dec 25 2023 1:42 AM

- - Sakshi

పేదలే సీఎం జగనన్నకు నేస్తాలు.. వారి ఆనందాలే ఆయనకు సంతృప్తి నిస్తోంది..  వారికి కూడు, గుడ్డ, నీడ నివ్వడం.. వారిని ప్రేమతో చూసుకోవడమే ఆయనకు తెలిసిన పని.. అందుకే ఇళ్లు లేని నిరుపేదలు పైరవీకారులను ఆశ్రయించే పనిలేకుండా చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలకు చెక్‌ పెట్టారు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న బడుగులకు సొంతింటి కల సాకారం చేశారు. ఆర్థిక స్తోమత లేని అభాగ్యులకు అండగా నిలిచారు. అందుకే ఆయన పేదల పక్షపాతి అయ్యారు. పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో అర్హులందరికీ  స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ పథకం లబ్ధిదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..  
– చిత్తూరు కలెక్టరేట్‌  

జగన్న పుణ్యంతో ఇల్లు కట్టుకున్నాం 
రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో ఇంటి పని పూర్తి చేశాం. మంచి ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో పనులు పూర్తి చేశాం. ఇల్లు మంజూరు కోసం గతంలో లెక్కలేనన్ని సార్లు అధికారులకు వద్దకు వెళ్లి అర్జీలు ఇచ్చాం. అప్పట్లో ఏ మాత్రం సమస్యను పట్టించుకోలేదు. తిరిగి తిరిగి వేశారిపోయి ఆశలు వదులుకున్నాం. సీఎం జగనన్న పుణ్యమాని ఇల్లు కట్టుకున్నాం. మా ఇంటిల్లిపాది సీఎంకు రుణపడి ఉంటాం.  
 – గౌరి, పచ్చికాపల్లం. వెదురుకుప్పం. 

విలువైన స్థలంతో పాటు ఇల్లు కట్టించారు  
విలువైన స్థలం ఉచితంగా ఇచ్చారు. ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు. మా మండలంలో ప్రధాన రహదారి పక్కనే స్థలం కేటాయించారు. టీడీపీ పాలనలో ఇంటి స్థలం కోసం జన్మభూమి కమిటీ సమావేశాల్లో లెక్కలేనన్ని సార్లు అర్జీలు ఇచ్చాం. అయినా న్యాయం జరగలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీరు మా వద్దకు వచ్చి వివరాలు తీసుకుని వెళ్లి ఇంటి స్థలంతో పాటు, ఇళ్లు మంజూరు చేయించారు. సీఎం జగనన్న లాంటి ప్రజానాయకుడిని ఎన్నటికీ మరిచిపోము.          
–కుమారి, టీకెఎంపురం. 

సొంత గూడు దొరికింది 
రోజు కూలీ పనులకు వెళితేగానీ మాకు పూట గడవదు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత మాకు లేదు. అప్పులు చేయాలన్నా అప్పు పుట్టదు. కూలీ నాలీ చేస్తే వచ్చే డబ్బులతో అద్దె ఇంట్లో సంవత్సరాలు గడిపాం. సీఎం జగనన్న ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మాకు సొంతింటి కల నెరవేర్చారు. ఉచితంగా ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇల్లుని నిర్మించి ఇచ్చారు. దీంతో మాకు సొంత గూడు దొరికింది. సీఎం జగనన్న మేలు ఎన్నటికీ మరువలేము.  
 –వనమ్మ, కోణంగిపల్లె, వెదురుకుప్పం మండలం 

మా కల సాకారం చేశారు  
సీఎం జగనన్న మా కల సాకారం చేశారు. సొంతింటి కోసం సంవత్సరాలుగా కలలు కన్నాం. గత సర్కారులో ఎవరూ మా సమస్యను పట్టించుకోలేదు. సొంతిల్లు ఇస్తామని మాటలు చెప్పి, మాయ చేశారే తప్ప న్యాయం చేయలేదు. కొన్ని సామాజిక వర్గాలకే గతంలో న్యాయం చేసేవారు. ఇప్పుడు అలా కాదు నాలాంటి పేదలందరికీ జగనన్న న్యాయం చేశారు.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేలును ఎప్పటికీ మరిచిపోము. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యింది.  
–జమున, చిన్నపోటుచేను. వెదురుకుప్పం మండలం  

Advertisement
Advertisement