శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్‌?!

Zydus Cadila Covid vaccine close to getting approved in India, says MD Sharvil Patel - Sakshi

త్వరలోనే అందుబాటులోకి రానున్న జైడస్ టీకా

జూలై నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తాం: జైడస్ క్యాడిలా

నెలకు  కోటి  మోతాదులను ఉత్పత్తి   చేసే సామర్థ్యం 

12-17 ఏళ్లలోపు పిల్లలపై కూడా క్లినికల్‌ ట్రయల్స్‌

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా డిమాండ్‌కు తగినంత సరఫరా లేక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ ఊరట నందించే కబురు చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ `జైకోవ్-డి` భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులకు దరఖాస్తు  చేయనుంది. అంతేకాదు త్వరలోనే అనుమతులు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.

తమ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్  జైకోవ్-డి భారతదేశంలో ఆమోదం పొందే సమయం చాలా దగ్గరలోనే ఉందని జైడస్‌ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ తెలిపారు. ఈ నెలలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతులు కూడా ఈ నెలలోనే లభించనున్నాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ పెయిన్‌లెస్‌ కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే నెలకు కోటి మోతాదులను ఉత్పత్తి  చేసే సామర్థ్యం ఉందన్నారు. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే,  జూలై నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని పటేల్  తెలిపారు.

ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్ ద్వారా అందించే ఈ వ్యాక్సిన్ 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య నిల్వ చేయవలసి ఉన్నప్పటికీ,  25 డిగ్రీల సెల్సియస్  రూం టెంపరేచర్‌  వద్ద  కూడా స్టోర్‌ చేయవచ్చని,  నిర్వహించడం చాలా సులభమని పటేల్‌  వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై `జైకోవ్-డీ’ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను సంస్థ ప్రారంభించిందనీ, ఈ నెలలోనే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రానున్నాయని చెప్పారు. అంతేకాదు 12-17 ఏళ్లలోపు పిల్లలను కూడా ఇందులో చేర్చినట్టు  తెలిపారు.  ఈ మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ చెబుతోంది.  మేడిన్‌ ఇండియా టీకా ఉత్పత్తికి ఇప్పటికే మరో రెండు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. తద్వారా నెలకు 3-4 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని  కంపెనీ లక్ష్యం. దీనికి అమోదం లభిస్తే  జైకోవ్-డీ  దేశంలో నాలుగో వ్యాక్సిన్ అవుతుంది.

చదవండి :  కోవిన్ యాప్‌: కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది?
కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 16:26 IST
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్...
08-05-2021
May 08, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌...
08-05-2021
May 08, 2021, 15:28 IST
రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి...
08-05-2021
May 08, 2021, 15:07 IST
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌...
08-05-2021
May 08, 2021, 15:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి రెండో డోసు వేసుకునే లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర...
08-05-2021
May 08, 2021, 14:55 IST
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ల...
08-05-2021
May 08, 2021, 14:04 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 13:56 IST
లండన్‌: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇటీవలే కొన్ని దేశాలు ఈ వైరస్‌ బారినుంచి మెల్లగా కోలుకుంటున్నాయి....
08-05-2021
May 08, 2021, 13:10 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
08-05-2021
May 08, 2021, 11:06 IST
సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కార్యక్రమం మందగిస్తోంది.. 16 కోట్ల కంటే ఎక్కువ మందికి...
08-05-2021
May 08, 2021, 08:36 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇది రామంతాపూర్‌లోని వివేకానగర్‌ కాలనీలో వెలసిన వారాంతపు సంత. జనం గుంపుల కొద్దీ పోగయ్యారు. తిరునాళ్లను తలపించారు....
08-05-2021
May 08, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి...
08-05-2021
May 08, 2021, 04:16 IST
కోవిడ్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్‌ చేశారు. అక్కడి...
08-05-2021
May 08, 2021, 03:45 IST
కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది.
08-05-2021
May 08, 2021, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన...
08-05-2021
May 08, 2021, 03:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు...
08-05-2021
May 08, 2021, 03:26 IST
సాక్షి, అమరావతి:  జిల్లా స్థాయిలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన...
08-05-2021
May 08, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల...
08-05-2021
May 08, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు...
08-05-2021
May 08, 2021, 03:09 IST
రాష్ట్రంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top